Daily Archives: October 5, 2017

బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని స్థానిక పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ అంతిరెడ్డి పిట్లం ఠానాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు నిజాంసాగర్‌ ఎస్‌ఐగా ఉపేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు చోరీల నివారణకు తనవంతు కృషి చేస్తానని, మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన అన్నారు.

Read More »

కాలువను పరిశీలించిన క్వాలిటి కంట్రోల్‌ టీం

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ హెర్సులూస్‌ జలవిద్యుత్‌ కేంద్రం నుంచి నీటి విడుదల కావడంతో ప్రధాన కాలువను క్వాలిటి కంట్రోల్‌ ఇఇ దామోదర్‌ పరిశీలించారు. సింగూరు నుంచి నీటి విడుదల కావడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టు కాలువలో నీరుపెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు 12, 16 వరద గేట్లను కూడా పరిశీలించారు. ఆయన వెంట డిఇ జావిద్‌, దత్తాత్రి, ఏ.ఇ.లు …

Read More »

కామారెడ్డి పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ అభివృద్దికి వార్డుల ప్రగతికి మునిసిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. గురువారం కలెక్టరేట్‌ కార్యాలయంలో మునిసిపల్‌ శాఖ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మునిసిపల్‌ శాఖకు సంబంధించి ఐదు కమ్యూనిటి టాయిలెట్స్‌, రెండు వైకుంఠదామాలు, వాటికి కాంపోండ్‌ వాల్‌ ఏర్పాటు, రెండు స్మృతి, రాశి వనాలు ఏర్పాటు చేశారని, పెండింగ్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. పారిశుద్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని చెప్పారు. జిల్లాలో ప్రతిపాదిత …

Read More »

సంక్షేమ శాఖలపై ప్రగతి నివేదిక

  కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని జడ్పిహాల్‌లో గురువారం 6వ స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. ఇందులో అన్ని సంక్షేమ శాఖల ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. అనంతరం ప్రగతి నివేదికలపై ఆయా శాఖల అధికారులను సభ్యులు ప్రశ్నించారు. చేయాల్సిన పనులు, సలహాలపై సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, కామారెడ్డి జిల్లా గిరిజన అభివృద్ది అధికారి గంగాధర్‌, డిఎస్‌పిడివో అంజయ్య, మహిళ అభివృద్ధి శాఖాధికారి రాధమ్మ, …

Read More »

సిపిఎం కార్యాలయంపై బిజెపి, ఆరెస్సెస్‌ దాడి గర్హణీయం

  కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఢిల్లీ, కేరళ రాష్ట్రంలోని సిపిఎం కార్యాలయాలపై బిజెపి, ఆరెస్సెస్‌ గుండాల దాడి గర్హణీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం కామారెడ్డి పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ కేరళలో సిపిఎం ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూడలేక బిజెపి, ఆరెస్సెస్‌లు విభేదాలు సృష్టిస్తూ దాడులు చేస్తున్నారన్నారు. బిజెపి పాలిత ప్రాంతాల్లో దళితులు, గిరిజనులపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటి సభ్యుడు సిద్దిరాములు, నాయకులు మోతిరాంనాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గ్రామసభలో పింఛన్లపై రసాభాసా…

  బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో గురువారం ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. మొదటగా గత మూడునెలలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను చదివి వినిపించారు. మండల కేంద్రంలో పించన్లు పంపిణీ చేసే పోస్టల్‌ అధికారి అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు వచ్చినా డ్రా చేసుకొని స్వంతానికి వాడుకుంటున్నాడని, తరువాతి నెలలో అందజేస్తున్నాడని మల్లెల హన్మంతు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పోస్టల్‌ అధికారిని గ్రామ …

Read More »

కుంటలో పడి వృద్దుని మృతి

  నందిపేట, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని చింరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బెల్లుల నారాయణ (55) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఎస్‌ఐ, స్థానికుల కథనం ప్రకారం… గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామంలోని మదిగకుంట వద్దకు వెళ్ళగా ప్రమాదవశాత్తు కాలుజారి కుంటలోపడి మృతిచెంది ఉంటాడని ఎస్‌ఐ సంతోష్‌ పేర్కొన్నారు. నారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నాడన్నారు. భార్య లస్ముబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మృతునికి ఇద్దరు …

Read More »

సంకల్పసిద్ధితో కృషితో ముందుకు సాగాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాల్మీకి కులస్తులు వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని సంకల్పసిద్ధితో కృషి చేసి ఋషులుగా మారాలని అన్నారు. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో గురువారం వాల్మీకి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత జ్ఞానం ద్వారా ఆలోచనా దృక్పథం, అలవాట్లు, పనులు, నైపుణ్యాన్ని సాధించుకొని అన్ని రంగాల్లో ముందుకు పోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి జయంతిని ప్రతియేటా నిర్వహించి చైతన్య పరుస్తుందని చెప్పారు. జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌సిండే మాట్లాడుతూ వాల్మీకి …

Read More »

కార్మికశాఖ కార్యాలయంలో సిబ్బందిని నియమించాలని వినతి

  కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ కార్యాలయంలో తగినంత సిబ్బందిని నియమించాలని గురువారం కార్మిక నాయకులు ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికశాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌లు బదిలీపై వెళ్ళారని, సిబ్బంది లేకపోవడంతో కార్యాలయానికి వచ్చిన వారిని తిప్పి పంపుతున్నారన్నారు. జిల్లాలో 50 వేల గుర్తింపు కార్మికులు, 9 వేల భవన కార్మికులు ఉన్నారని, వీరికోసం అధికారులు అవసరమని పేర్కొన్నారు. ఏర్పాటు …

Read More »

మరుగుదొడ్ల లక్ష్యాన్ని పూర్తిచేయండి

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాన్ని సకాలంలోపూర్తిచేయాలని ఇజిఎస్‌ ఎపివో సుదర్శన్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లను కోరారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమావేశంలో ఎపివో మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని అక్టోబరు నెలాఖరులోగా పూర్తిచేసేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు కృషి చేయాలన్నారు. ఉదయం సమయంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్ళి మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకోకుంటే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని లబ్దిదారులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ జయశ్రీ, బాల్‌సింగ్‌ ఉన్నారు.

Read More »