Daily Archives: October 6, 2017

సర్వశిక్షాఅభియాన్‌లో తాత్కాలిక పోస్టులకు ఆహ్వానం

  కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్వశిక్షా అభియాన్‌లో కామారెడ్డి జిల్లాలో పలు పోస్టులు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ తెలిపారు. ఈనెల 10 వరకు గడువు పొడిగించినట్టు తెలిపారు. అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌-1, సిస్టమ్‌ అనలిస్టు-1, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ -2, ఐఇఆర్‌పి -2, పిఇటి-3, అకౌంటెంట్‌-2, ఏఎన్‌ఎం-2, ఎన్‌ఐసి కోఆర్డినేటర్‌-1 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. కెజిబివిల స్పెషల్‌ అధికారులు-2, సిఆర్‌టి -3 ఖాలీలు అందుబాటులో ఉన్న …

Read More »

ఈదురుగాలులకు పంట నష్టం

  బీర్కూర్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో చేతికొచ్చిన పంట నేలకొరిగింది. నసురుల్లాబాద్‌ మండలంలోని బొప్పాస్‌ పల్లి గ్రామంలో సుమారు వంద ఎకరాల పంట ఈదురుగాలులకు నేలకూలినట్టు వ్యవసాయాధికారులు శుక్రవారం పరిశీలించి తెలిపారు. ఈదురుగాలుల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Read More »

ప్రతినెల మొదటి శనివారం బిచ్కుందలో ప్రజావాణి

  కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతినెల మొదటి శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రజావాణి నిర్వహించనున్నట్టు కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బిచ్కుంద వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ప్రజావాణిలో పాల్గొని తమ ఫిర్యాదులు అందజేయవచ్చని తెలిపారు. ఆయా శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటారని కలెక్టర్‌ అన్నారు. ఇందులో భాగంగా ఈనెల 7న శనివారం బిచ్కుందలో ప్రజావాణి ఉంటుందని పేర్కొన్నారు.

Read More »

రెడ్డి పాదయాత్రకు సంఘీభావం

  కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్డి పోరుయాత్ర శుక్రవారం కామారెడ్డి పట్టణంలోకి ప్రవేశించిన నేపథ్యంలో యాత్రకు జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు స్వాగతం పలికారు. వారికి తమ సంఘీభావం తెలిపారు. ఓసిలకు రిజర్వేషన్‌ కల్పించాలని రెడ్డి కులస్తులు పాదయాత్ర చేపట్టారు. దీనికి ఆర్యవైశ్యులు సంఘీభావం తెలిపారు.

Read More »

పిడుగుపాటుతో ఇద్దరు మృతి – ఇద్దరి పరిస్థితి విషమం

  కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసన్నపల్లిలో శుక్రవారం పిడుగుపడి ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. భిక్కనూరు మండలం మోటాటుపల్లికి చెందిన రాజిరెడ్డి, భిక్షపతి బసన్నపల్లిలోని కొయ్యగుట్ట ఆలయ ప్రాంగణంలో పుట్టు వెంట్రుకల మొక్కు చెల్లించుకోవడానికి వెళ్లారు. వారితోపాటు సరిత, కొండల్‌రెడ్డిలు ఉన్నారు. ఆనందంగా పండగ చేసుకుంటున్న తరుణంలో భారీ వర్షంపడి వారున్న ప్రాంతంలోనే ఒక్కసారిగా పిడుగుపడడంతో రాజారెడ్డి, భిక్షపతిలు మృతి చెందారు. సరిత, కొండల్‌రెడ్డిలకు తీవ్ర గాయాలుకాగా …

Read More »

మల్లూరులో గ్రామసభ

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి కుటుంబంలో తప్పకుండా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఎంపిడివో రాములు నాయక్‌ అన్నారు. మండలంలోని ఒడ్డేపల్లి, నర్వా గ్రామాల్లో సర్పంచ్‌ల అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి వీరభద్రయ్య ముందుగా ఆదాయ, వ్యయాలను చదివి వినిపించారు. గ్రామ పంచాయతీ అభివృద్ది కోసం పలు తీర్మానాలు చేశారు. మల్లూరు గ్రామసభలో ఎంపిడివో మాట్లాడుతూ ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. లబ్దిదారులు రూపాయి ఖర్చు లేకుండా ప్రబుత్వమే రూ. 12 వేలతో …

Read More »

బీర్కూర్‌ ఎస్‌ఐగా సంపత్‌

  బీర్కూర్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఐ బదిలీల్లో భాగంగా బీర్కూర్‌ ఎస్‌ఐగా సంపత్‌కుమార్‌ శుక్రవారం బాద్యతలు చేపట్టారు. లింగంపేట్‌ మండలంలో ఎస్‌ఐగా విధులు నిర్వహించి బదిలీపై బీర్కూర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేకాట, బెల్టుషాపుల నిర్వహణపై చర్యలు తీసుకుంటామని, గ్రామస్తుల సహకారంతో మండలంలో శాంతిబద్రతలు నెలకొల్పుతామని పేర్కొన్నారు.

Read More »

శబరిమలైకి పాదయాత్ర

  బీర్కూర్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాను నివసిస్తున్న గ్రామం, మండలం పచ్చని పంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ బీర్కూర్‌ ఎంపిటిసి-2 సుధాకర్‌ యాదవ్‌ అయ్యప్ప మాలధారణ చేసి బీర్కూర్‌ నుంచి శబరిమలైకి కాలినడకన బయల్దేరాడు. శుక్రవారం ఉదయం 5 గంటలకు గ్రామస్తుల సమక్షంలో బీర్కూర్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించాడు. మకర సంక్రాంతి వరకు శబరిమలై చేరుకొని దీక్ష విరమిస్తానని, సుమారు 1600 కి.మీ.లు పాదయాత్ర చేయడం జరుగుతుందని, 45 రోజుల్లో పూర్తిచేసే సంకల్పంతో బయల్దేరారు.

Read More »

పెరుగుతున్న నీటి మట్టం

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ జలాశయంలోకి సింగూరు నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు జలాశయంలోకి 3 టిఎంసిల నీరు నిలువ ఉందని డిప్యూటి ఇఇ దత్తాత్రి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ పరిధిలోగల సింగూరు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురియడంతో నీరు చేరిందని అన్నారు. జలాశయంలోకి ఇన్‌ప్లో పెరుగుతుందని, నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్ని నీటివద్దకు వెళ్లకుండా సమాచారం అందించాలన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయం ద్వారా …

Read More »

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

  కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో శుక్రవారం విద్యుదాఘాతంతో తల్లి, కొడుకు మృతి చెందిన సంఘటగన గ్రామంలో విషాదం నింపింది. శుక్రవారం భారీ వర్సాలు కురియడంతో ఇంటివద్ద కరెంటు షాక్‌ తగిలి లక్ష్మి (30), ఋషి (3) మృతి చెందారు. కళ్లముందే ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. బంధువుల రోదనలు మిన్నంటాయి.

Read More »