Daily Archives: October 7, 2017

అభివృద్ది పనుల పరిశీలన

  నందిపేట, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని డొంకేశ్వర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులను ఇవో పిఆర్‌డి రాజేశ్వర్‌గౌడ్‌ శనివారం పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించి నాణ్యతతో పనులు చేసి త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్‌ హరిదాస్‌ ఉన్నారు.

Read More »

పోలీసు అమరవీరుల ప్రచారరథం ప్రారంభం

  కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో రెండవ ఇండియన్‌ పోలీసు అమరవీరుల మెమోరియల్‌ రన్‌ ప్రచార రథాన్ని జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఈనెల 15న ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో నిర్వహించనున్న 2 కి.మీ, 5 కి.మీ, 10 కి.మీ, పరుగు పందెం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు నాలుగు ప్రచార రథాలు హైదరాబాద్‌ …

Read More »

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సందర్శన

  కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్నూర్‌ మండలం సిరిపురం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. ప్రక్షాళన జరుగుతున్న తీరును సమీక్షించారు. అక్కడున్న ప్రజలను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పూర్తిగా సహకరించి రికార్డులు ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీవో రాజేశ్వర్‌, మద్నూర్‌ తహసీల్దార్‌ ధన్‌వాల్‌ అధికారులు పాల్గొన్నారు.

Read More »

బిచ్కుందలో ప్రజావాణి

  కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో శనివారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రజల నుంచి నేరుగా వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతినెల మొదటి శనివారం బిచ్కుంద మండలంలో ఇకనుంచి ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే శనివారం తమకందిన వినతులను, ఫిర్యాదులను వివిధ శాఖల అధికారులకు అందించినట్టు కలెక్టర్‌ వివరించారు. వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్‌, ఐసిడిఎస్‌ సంక్షేమాధికారిణి …

Read More »

అంగన్‌వాడిల సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడిల సమస్యలు పరిస్కరించాలని వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు అన్నారు. అంగన్‌వాడి జీపుజాతను శనివారం బిక్కనూరు మండల కేంద్రంలో ప్రారంభించారు. అంగన్‌వాడి ఉపాధ్యాయురాలు యాదమ్మ జెండా ఊపి కార్యక్రమం ప్రారంభించారు. భిక్కనూరు నుంచి దోమకొండ మీదుగా జాత మాచారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా సిద్దిరాములు మాట్లాడుతూ జీవో 19ని ప్రభుత్వం రద్దుచేయాలని, అంగన్‌వాడి టీచర్లకు రూ. 3 లక్షలు, హెల్పర్లు, మినీ వర్కర్లకు రూ. 2 …

Read More »

మహిళ అదృశ్యంపై ఫిర్యాదు

  కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని ఇస్లాంపురకు చెందిన ఎల్లుల మౌనిక (23) శుక్రవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిందని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శోభన్‌ తెలిపారు. ప్రయివేటు జాబ్‌ చేస్తున్న మౌనిక శుక్రవారం రాత్రి నుంచి కనబడకుండా పోయిందని లక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Read More »

బిజెపి గ్రామ అధ్యక్షుడు తెరాసలో చేరిక

  నందిపేట, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం డొంకేశ్వర్‌ గ్రామ భారతీయ జనతాపార్టీ గ్రామ అధ్యక్షుడు గాండ్ల కిష్టమల్ల గంగారెడ్డి తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని ఎంపి కవిత నివాసంలో, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆద్వర్యంలో శనివారం ఉదయం తెరాసలో చేరారు. పార్టీ కండువా వేసి తెరాసలోకి ఆహ్వానించిన ఎంపి కవిత మాట్లాడుతూ బంగారు తెలంగాణ కెసిఆర్‌ నాయకత్వంలో తెరాసతోనే సాద్యమని అన్నారు. యువకులు పార్టీలో చేరడం హర్షణీయమన్నారు. మన ఊరు – మన ప్రణాళికలో భాగంగా …

Read More »

మరుగుదొడ్లు నిర్మించుకోండి

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని కోమలంచ గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల పై పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు తప్పకుండా నిర్మించుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల కోసం 12 రూపాయలు అందిస్తుందని, తప్పకుండా నిర్మించుకోవాలని, లేకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని ప్రజలకు హెచ్చరించారు. ప్రతి ఇంటికి వెళ్ళి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సాదుల సత్యనారాయణ, గ్రామస్తులు …

Read More »

చెరువులో చేపపిల్లల విడుదల

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెరువులో చేపపిల్లలు విడుదల చేయడంతో మత్స్య కార్మికుల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని తెరాస నాయకులు వాజిద్‌అలీ, దఫేదార్‌ విజయ్‌, మహేందర్‌లు అన్నారు. సింగీతం రిజర్వాయర్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 85 వేల చేప పిల్లలను శనివారం విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి కోల్పోయి పట్టణాలకు వలసవెళ్ళిన మత్స్య కార్మికుల కోసం కెసిఆర్‌ ప్రభుత్వం చేపపిల్లలను వందశాతం సబ్సిడీకింద సరఫరా చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార్మికులను వివిధ రకాలుగా ఆదుకుంటుందని, …

Read More »

బూర్గుల్‌లో గ్రామసభ

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట్‌, బూర్గుల్‌ గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. బూర్గుల్‌ కార్యదర్శి క్యాసప్ప ఆదాయ, వ్యయాలు, జమ ఖర్చులు నివేదికలు చదివి వినిపించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యలు విన్నవిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు, వీధి దీపాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కారానికి కృసి చేస్తామన్నారు. మండలంలోని బూర్గుల్‌ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ …

Read More »