Daily Archives: October 9, 2017

కలెక్టర్‌, ఎస్‌పి కార్యాలయాల స్థల పరిశీలన

  కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన ఆవిర్బావ జిల్లాల ఏర్పాటులో భాగంగా నూతనంగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాకు మంజూరైన అడ్లూర్‌ గ్రామ శివారులోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయ, పోలీసు కార్యాలయ నిర్మాణాలకు సంబంధించి స్థల ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. అక్టోబరు 11న నూతన జిల్లాగా ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇందిరాగాందీ స్టేడియంలో ఉదయం 11 గంటల నుంచి ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని అదికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, …

Read More »

ఓంకార్‌ భవన కార్యాలయ ప్రారంభ గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంసిపిఐయు ఓంకార్‌ భవన్‌ రాష్ట్ర కార్యాలయ ప్రారంభ సభకు సంబంధించిన గోడప్రతులను సోమవారం కామరెడ్డిలో ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎంసిపిఐయు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఈనెల 17న పార్టీ వ్యవస్థాపకుడు మద్దికాయల ఓంకార్‌ 9వ వర్ధంతి సందర్భంగా ప్రారంభించనున్నట్టు తెలిపారు. దీనికి దేశంలోని అన్ని వామపక్షాల జాతీయ కార్యదర్శులు హాజరవుతారని, జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. సభకు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, మహ్మద్‌ గౌస్‌ హాజరుకానున్నట్టు తెలిపారు. వామపక్షాల ప్రతినిధులు, …

Read More »

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

  కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2018-19 సంవత్సరంలోనిజాంసాగర్‌ జవహార్‌ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్లో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3,4 తరగతులు చదివి ఉత్తీర్ణులై ప్రస్తుత విద్యాసంవత్సరంలో జిల్లాలో 5వ తరగతి చదువుతున్నవారు ఇందుకు అర్హులని తెలిపారు. విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుని నుంచి నిర్దారణ దృవీకరణ పత్రం తీసుకొని నవంబర్‌ 25 లోగా షషష.అఙరష్ట్రన.శీతీస్త్ర ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. ఎంపిక పరీక్ష ఫిబ్రవరి …

Read More »

డయల్‌యువర్‌ ఎస్‌పిలో 5 ఫిర్యాదులు

  కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్‌పి కార్యక్రమంలో ప్రజల నుంచి 5 ఫిర్యాదులు అందినట్టు జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి తెలిపారు. కామారెడ్డి-1, మాచారెడ్డి-1, తాడ్వాయి-1, బాన్సువాడ-1, బీబీపేట-1 స్టేషన్లకు సంబందించి ఫిర్యాదులు అందాయన్నారు. పిర్యాదులు పరిస్కరించాలని సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు ఆదేశించినట్టు ఎస్‌పి పేర్కొన్నారు.

Read More »

బీడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

  కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీడీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆద్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం సమీపంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ బీడీలేనన్నారు. రాష్ట్రంలో 7 లక్షల మంది బీడీ కార్మికులున్నారని, పరిశ్రమపై ఆధారపడి కోటి 50 లక్షల …

Read More »

70 ఏళ్ళనుంచి జరగని అభివృద్దిని మూడేళ్ళలో చేసిచూపాం…

  కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 70 ఏళ్ళ నుంచి జరగని అభివృద్ధి పనులను గత మూడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపిందని, అభివృద్దియే అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన బీబీపేట మండల కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా జరిగిన సభలో మంత్రి ప్రజల నుద్దేశించి మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసమే నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటు చేశామన్నారు. …

Read More »

ప్రజావాణిలో 70 ఫిర్యాదులు

  కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రజల నుంచి వచ్చిన 70 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో అధిక శాతం రెవెన్యూశాఖ, పెన్షన్‌లకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులు అందాయి. వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు వాటిని పంపినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్వో మణిమాల, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »