Daily Archives: October 10, 2017

పెరుగుతున్న నిజాంసాగర్‌ నీటిమట్టం

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు నిజాంసాగర్‌ ప్రాజెక్టు డిప్యూటి ఇఇ దత్తాత్రి తెలిపారు. సింగూరు ప్రాజెక్టు నుంచి 9 టిఎంసిల నీటిని విడుదల చేస్తున్నారని సిఎం కెసిఆర్‌ అనుమతించడంతో సోమవారం నుంచి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని తెలిపారు. సింగూరు జలాశయం టర్బయిన్‌ ద్వారా 1600 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారని మంజీర నది ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీరు వచ్చి …

Read More »

చేపపిల్లల పంపిణీ

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం వందశాతం సబ్సిడీకింద మత్స్యకార్మికులకు చేపపిల్లలు అందిస్తుందని మత్స్యకార్మికుల సంఘ నాయకులు కోరారు. మండలంలోని 27 చెరువులకు చేప పిల్లల్ని పంపిణీ చేశామని, నియోజకవర్గంలో 6 మండలాల్లో 104 చెరువులున్నాయని అందులో 38 లక్షల 89 వేల 350 చేపపిల్లలను అధికారులు విడుదలచేసేందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట మత్స్యసహకార సంఘాల డైరెక్టర్‌ మైశయ్య తెలిపారు. మత్స్యకార్మికులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని …

Read More »

ఇబ్బందులు తొలగించేందుకే భూరికార్డుల ప్రక్షాళన

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో రైతులకు ఇబ్బందులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన సర్వే కార్యక్రమం చేపడుతుందని బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్‌ అన్నారు. మండలంలోని హసన్‌పల్లి, బంజేపల్లి గ్రామసభల్లో ఆర్డీవో పాల్గొని గ్రామస్తులతో మాట్లాడారు. ఆన్‌లైన్‌ ద్వారా పహణీ నఖలు పంట రుణాలు తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి గ్రామంలో పదిరోజుల పాటు రెవెన్యూ బృందం రైతులకు సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్లో నమోదు చేస్తుందన్నారు. సర్వేలో వివరాలు తప్పకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. …

Read More »

కళ్యాణి ప్రాజెక్టు గేటు ఎత్తివేత

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని కళ్యాణి ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడదుల చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ అధికారి అబ్బయ్య తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి, కళ్యాణి, లింగంపల్లి, ఎల్లారెడ్డి, తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కళ్యాణి ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేటు ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఆయన అన్నారు. పంట పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. …

Read More »

గంగపుత్రుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

  బీర్కూర్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంగపుత్రుల సంక్షేమానికి తెరాస ప్రబుత్వం ఎల్లప్పుడు కృసి చేస్తుందని నాయకులు గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాయిలు అన్నారు. మండల కేంద్రంలోని రాకుంట చెరువులో మంగళవారం చేపపిల్లల విత్తనాలను వదిలారు. సుమారు లక్ష పిల్లలు వదిలినట్టు తెలిపారు. ఈ సందర్భంగ సాయిలు మాట్లాడుతూ జిల్లాలో గంగపుత్రుల సంక్షేమానికి తెరాస ప్రబుత్వం కృషి చేస్తుందని, గంగపుత్రుల సంఘ భవనాల నిర్మాణాలకు చేయూత నిస్తుందని, సిఎం కెసిఆర్‌ చొరవతో చేపల పెంపకానికి మిషన్‌ కాకతీయ …

Read More »

విద్యార్థులకు భోజనం ప్లేట్ల పంపిణీ

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని కోమలంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు మంగళవారం అందజేశారు. ఆరోగ్యశాఖ మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆయన బంధువు విట్టమ్మ జ్ఞాపకార్థం 150 మంది విద్యార్థులకు భోజనానికి అవసరమయ్యే ప్లేట్లు, తాగునీటి గ్లాసులు పంపిణీ చేశారు. విద్య నేర్చుకున్న పాఠశాల అభివృద్ది కోసం అన్ని విధాలా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్నాకర్‌, ఉపాధ్యాయులు సరిత, సాయాగౌడ్‌ ఉన్నారు.

Read More »

ప్రధానోపాధ్యాయుల సమావేశం

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంఇవో కార్యాలయంలో ప్రధానోపాధ్యాయుల సమావేశం మంగళవారం నిర్వహించారు. మండల విద్యాధికారి బలరాంరాతోడ్‌ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అనే అంశంపై మాట్లాడారు. ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లకుండా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినేటట్టు ప్రతి ఉపాధ్యాయుడు శ్రద్ద వహించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఉన్నత పాఠశాలలో సన్నబియ్యం ఏర్పాటు చేసిందని, ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో …

Read More »

అకాలవర్షం- భారీ పంట నష్టం

  బీర్కూర్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అప్పులు సొప్పులు చేసి ఆరుగాలం కష్టించిన రైతుకు దీపావళి లక్ష్మి పండగ ముందుగా లక్ష్మి దేవి వస్తుందన్న రైతు ఆశ అడియాశ అయింది. పంట పండించడానికి పెట్టిన పెట్టుబడి కోల్పోతుందన్న భయంతో ఊపిరిని బిగపట్టుకొని పంటి బిగువున ఉన్న బాధను ఎవరికి చెప్పుకోవాలో తోచక కన్నీటిపర్యంతమవుతున్న రైతుబాధ బీర్కూర్‌ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్సానికి వేల ఎకరాల పంట నేలకొరిగింది. …

Read More »

జోరువానతో పంటనష్టం

  నందిపేట, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా గత రెండు మూడురోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. నందిపేట మండలంలో రాత్రుళ్ళు అధిక వర్షం కురుస్తుంది. భారీ ఉరుములు, మెరుపులతో కురుస్తున్న జోరువానకు కోతదశకు వచ్చిన వరిపంట నేలకొరిగింది. ఆదివారం ఉదయం, సోమవారం రాత్రి మండలవ్యాప్తంగా జోరువాన కురిసింది. పెద్దమొత్తంలో పంట నష్టం వాటిల్లడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఇదివరకు అనావృస్టి ఉన్నప్పటికి మోటబావుల ద్వారా గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటిని వాడుకొని పగలు, రాత్రి కష్టపడి పండించిన …

Read More »

కొనసాగుతున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన

  నందిపేట, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని నికాల్‌పూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం తహసీల్దార్‌ ఉమాకాంత్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కొనసాగుతుంది. గ్రామస్తుల పట్టాపాసుపుస్తకాలు, భూ వివరాలు సరిచేసుకోవాలని సూచించారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Read More »