Breaking News

చేపపిల్లల పంపిణీ

 

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం వందశాతం సబ్సిడీకింద మత్స్యకార్మికులకు చేపపిల్లలు అందిస్తుందని మత్స్యకార్మికుల సంఘ నాయకులు కోరారు. మండలంలోని 27 చెరువులకు చేప పిల్లల్ని పంపిణీ చేశామని, నియోజకవర్గంలో 6 మండలాల్లో 104 చెరువులున్నాయని అందులో 38 లక్షల 89 వేల 350 చేపపిల్లలను అధికారులు విడుదలచేసేందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట మత్స్యసహకార సంఘాల డైరెక్టర్‌ మైశయ్య తెలిపారు. మత్స్యకార్మికులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎఫ్‌డివో సింగ్‌, మత్స్యకార్మికులు ఉన్నారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *