ఇబ్బందులు తొలగించేందుకే భూరికార్డుల ప్రక్షాళన

 

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో రైతులకు ఇబ్బందులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన సర్వే కార్యక్రమం చేపడుతుందని బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్‌ అన్నారు. మండలంలోని హసన్‌పల్లి, బంజేపల్లి గ్రామసభల్లో ఆర్డీవో పాల్గొని గ్రామస్తులతో మాట్లాడారు. ఆన్‌లైన్‌ ద్వారా పహణీ నఖలు పంట రుణాలు తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి గ్రామంలో పదిరోజుల పాటు రెవెన్యూ బృందం రైతులకు సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్లో నమోదు చేస్తుందన్నారు. సర్వేలో వివరాలు తప్పకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగరాజుగౌడ్‌, టీం లీడర్‌ చంద్రశేఖర్‌, సర్పంచ్‌లు బేగరి రాజు, తదితరులున్నారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *