Daily Archives: October 11, 2017

డ్రైవర్‌ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

  కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో 102 అంబులెన్సు సర్వీసుల్లో పనిచేసేందుకు డ్రైవర్‌ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రోగ్రాం మేనేజర్‌ జాన్‌ షహీద్‌ షేక్‌ తెలిపారు. ఈనెల 13న జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. అమ్మఒడి అంబులెన్సులు, పశుసంచార వైద్య వాహనాల్లో డ్రైవర్లకోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వివరాలకు 9959392391, 910079916 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

Read More »

చిన్న జిల్లాల ద్వారా ప్రజలవద్దకు పాలన

  కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజల వద్దకు పాలన, శాంతిభద్రతలు పూర్తిగా చేరాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా ప్రథమ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ. 50 కోట్లతో అడ్లూర్‌ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్‌ భవనం, రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఎస్‌పి కార్యాలయాలకు మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం …

Read More »

నేడు మెగా హెల్త్‌ క్యాంపు

  కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గురువారం ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఆయుష్‌ అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. వైద్యులు జయశ్రీ, రవిందర్‌రెడ్డి, దేవయ్య, సత్యనారాయణలు రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Read More »

అలరించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రథమ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. తెలంగాణ సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద గీతాలు, నృత్యాలు అబ్బురపరచాయి. విద్యాశాఖ ద్వారా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్వహించారు. అనంతరం కామారెడ్డి జిల్లా ప్రథమ వార్షికోత్సవ సూచికను విడుదల చేశారు. అందులో జిల్లా ఏర్పడిన నాటినుంచి ఏడాదిలో చేసిన అభివృద్ది పనుల …

Read More »

వలకు చిక్కిన 15 కిలోల అల్కాచేప

    కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నీరువచ్చి చేరింది. ఈక్రమంలో మత్స్యకారులకు చేపలు భారీగా లభిస్తున్నాయి. సోమిరియా గడ్‌ తాండాకు చెందిన అజ్మెరా లక్ష్మణ్‌ నాయక్‌కు ఫిషింగ్‌రాడ్‌తో చేపలు పడుతుండగా భారీ చేప తగిలింది. దాన్ని అతికష్టం మీద మరికొందరితోకలిసి పైకి లాగారు. రాడ్‌కు 15 కిలోల భారీ అల్కాచేప లభించింది. భారీగా చేపలు లభిస్తుండడంతో మత్స్యకారుల్లో ఆనందం నెలకొంది.

Read More »

మహిళలు సాధికారతతో ముందడుగు వేయాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు సాధికారతతో, ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ముందడుగు వేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం కామారెడ్డి జనహిత భవనంలో మహిళలపై లైంగిక వేధింపులు, భద్రతపై నిర్వహించిన ఓపెన్‌ ఫోరంలో కలెక్టర్‌ మాట్లాడారు. పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు తమకంటూ ఓ గుర్తింపుతో అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారన్నారు. మహిళలు తాము పనిచేసేచోట అనేక వేధింపులకు గురవుతున్నట్టు ఇదివరకే రుజువైందని చెప్పారు. వారికోసం 2013 లైంగిక వేధింపుల చట్టం ఉందని తెలిపారు. పదిమందికంటే …

Read More »

నిలకడగా నీటిమట్టం

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సింగీతం, కళ్యాణి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద ఉదృతి కొనసాగింది. సింగీతం ప్రాజెక్టులోకి 350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందని, అలాగే కళ్యాణి ప్రాజెక్టులోకి 250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందని ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 409.50 అడుగులుకాగా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. పెరుగుతున్న నిజాంసాగర్‌ నీటిమట్టం : సింగూరు ప్రాజెక్టు నుంచి 9 టిఎంసిల నీటిని అధికారులు విడుదల చేయడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతూ వస్తుంది. ప్రాజెక్టులోకి 2 వేల క్యూసెక్కుల …

Read More »

బాలలహక్కుపై ర్యాలీ

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కులను సద్వినియోగం చేసుకోవాలని నిజాంసాగర్‌ మండలంలోని మహ్మద్‌నగర్‌, నిజాంసాగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు బుధవారం వీధుల్లో తిరుగుతూ బాలల హక్కులను వివరిస్తు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఇఓ బలిరాంరాథోడ్‌ మాట్లాడుతూ బాలల హక్కులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అమర్‌సింగ్‌, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, శైలజ, రాములు, తదితరులున్నారు.

Read More »

విత్తనాల పంపిణీ

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని అచ్చంపేట సహకార కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై శనగ విత్తనాలను సిడిసి డైరెక్టర్‌ మోహన్‌రెడ్డి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న రైతులను అభివృద్ది చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముందుకెళుతున్నారన్నారు. వరి, మొక్కజొన్న, పెసర పంటలకు మద్దతు ధర అందించడంతోపాటు కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తెస్తామన్నారు. సాగుచేసుకునే రైతుకు రాయితీపై విత్తనాలు అందజేస్తున్నామన్నారు. 20 కిలోల బస్తాను రూ.1450 లకు …

Read More »

అంగన్‌వాడి కేంద్రం తనిఖీ

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సుంకిపల్లి గ్రామంలో అంగన్‌వాడి కేంద్రాన్ని బుధవారం పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప తనిఖీ చేశారు. కేంద్రంలో రికార్డులను పరిశీలించి సామగ్రి నిలువలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని గర్భిణీ, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారంపై అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు రోజు వచ్చి కేంద్రంలో భోజనం చేస్తున్నారా లేదా తెలుసుకున్నారు.

Read More »