వలకు చిక్కిన 15 కిలోల అల్కాచేప

 

 

కామారెడ్డి, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నీరువచ్చి చేరింది. ఈక్రమంలో మత్స్యకారులకు చేపలు భారీగా లభిస్తున్నాయి. సోమిరియా గడ్‌ తాండాకు చెందిన అజ్మెరా లక్ష్మణ్‌ నాయక్‌కు ఫిషింగ్‌రాడ్‌తో చేపలు పడుతుండగా భారీ చేప తగిలింది. దాన్ని అతికష్టం మీద మరికొందరితోకలిసి పైకి లాగారు. రాడ్‌కు 15 కిలోల భారీ అల్కాచేప లభించింది. భారీగా చేపలు లభిస్తుండడంతో మత్స్యకారుల్లో ఆనందం నెలకొంది.

Check Also

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  – నగర మేయర్‌ ఆకుల సుజాత నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *