చిన్న జిల్లాల ద్వారా ప్రజలవద్దకు పాలన

 

కామారెడ్డి, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజల వద్దకు పాలన, శాంతిభద్రతలు పూర్తిగా చేరాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా ప్రథమ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ. 50 కోట్లతో అడ్లూర్‌ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్‌ భవనం, రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఎస్‌పి కార్యాలయాలకు మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం జిల్లా ప్రథమ వార్షికోత్సవ సూచికను విడుదల చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌ రెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌సిండే, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేతారెడ్డి, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, డిఆర్వో మణిమాల, ఆర్డీవో శ్రీను, ప్రజాప్రతినిదులు అధికారులు పాల్గొన్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *