Breaking News

విత్తనాల పంపిణీ

 

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని అచ్చంపేట సహకార కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై శనగ విత్తనాలను సిడిసి డైరెక్టర్‌ మోహన్‌రెడ్డి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న రైతులను అభివృద్ది చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముందుకెళుతున్నారన్నారు. వరి, మొక్కజొన్న, పెసర పంటలకు మద్దతు ధర అందించడంతోపాటు కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తెస్తామన్నారు. సాగుచేసుకునే రైతుకు రాయితీపై విత్తనాలు అందజేస్తున్నామన్నారు. 20 కిలోల బస్తాను రూ.1450 లకు అందజేస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో సిడిసి ఛైర్మన్‌ దుర్గారెడ్డి, నాయకులు గైని విఠల్‌, వ్యవసాయాధికారి అమర్‌ ప్రసాద్‌, వివో రవిందర్‌, తదితరులున్నారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *