అలరించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

కామారెడ్డి, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రథమ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. తెలంగాణ సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద గీతాలు, నృత్యాలు అబ్బురపరచాయి. విద్యాశాఖ ద్వారా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్వహించారు. అనంతరం కామారెడ్డి జిల్లా ప్రథమ వార్షికోత్సవ సూచికను విడుదల చేశారు. అందులో జిల్లా ఏర్పడిన నాటినుంచి ఏడాదిలో చేసిన అభివృద్ది పనుల వివరాలు పొందుపరిచారు. వీటి గురించి ప్రజలకు చదివి వినిపించారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌ రెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌సిండే, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేతారెడ్డి, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, డిఆర్వో మణిమాల, ఆర్డీవో శ్రీను, ప్రజాప్రతినిదులు అధికారులు పాల్గొన్నారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *