బాలలహక్కుపై ర్యాలీ

 

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కులను సద్వినియోగం చేసుకోవాలని నిజాంసాగర్‌ మండలంలోని మహ్మద్‌నగర్‌, నిజాంసాగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు బుధవారం వీధుల్లో తిరుగుతూ బాలల హక్కులను వివరిస్తు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఇఓ బలిరాంరాథోడ్‌ మాట్లాడుతూ బాలల హక్కులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అమర్‌సింగ్‌, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, శైలజ, రాములు, తదితరులున్నారు.

Check Also

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  – నగర మేయర్‌ ఆకుల సుజాత నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *