నిలకడగా నీటిమట్టం

 

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సింగీతం, కళ్యాణి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద ఉదృతి కొనసాగింది. సింగీతం ప్రాజెక్టులోకి 350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందని, అలాగే కళ్యాణి ప్రాజెక్టులోకి 250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందని ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 409.50 అడుగులుకాగా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది.

పెరుగుతున్న నిజాంసాగర్‌ నీటిమట్టం :

సింగూరు ప్రాజెక్టు నుంచి 9 టిఎంసిల నీటిని అధికారులు విడుదల చేయడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతూ వస్తుంది. ప్రాజెక్టులోకి 2 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందని డిఇ దత్తాత్రి తెలిపారు. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారుల ఆదేశాల మేరకు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీటి విడుదల చేస్తున్నట్టు తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి నిలువ 4 టిఎంసిలకు చేరిందన్నారు.

 

పొంగిపొర్లుతున్న నల్లవాగు :

పిట్లం, కల్హేర్‌, నారాయణఖేడ్‌, బాచపల్లి, నిజాంపేట్‌ లలో కురిసిన భారీ వర్షాలతో నర్సింగ్‌రావుపల్లిలో పెద్ద వంతెన కిందినుంచివచ్చిన నీరు నల్లవాగు మత్తడి నుంచి భారీగా వరద పొంగిపొర్లుతుంది.

Check Also

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  – నగర మేయర్‌ ఆకుల సుజాత నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *