మహిళలు సాధికారతతో ముందడుగు వేయాలి

 

కామారెడ్డి, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు సాధికారతతో, ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ముందడుగు వేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం కామారెడ్డి జనహిత భవనంలో మహిళలపై లైంగిక వేధింపులు, భద్రతపై నిర్వహించిన ఓపెన్‌ ఫోరంలో కలెక్టర్‌ మాట్లాడారు. పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు తమకంటూ ఓ గుర్తింపుతో అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారన్నారు. మహిళలు తాము పనిచేసేచోట అనేక వేధింపులకు గురవుతున్నట్టు ఇదివరకే రుజువైందని చెప్పారు. వారికోసం 2013 లైంగిక వేధింపుల చట్టం ఉందని తెలిపారు. పదిమందికంటే ఎక్కువ ఉన్నచోట అంతర్గతంగా కమిటీ వేసుకోవాల్సి ఉంటుందని, ఈ కమిటీలో వివిధ రంగాల్లోని వ్యక్తులు సభ్యులుగా ఉంటారన్నారు. వీరు మహిళల సమస్యలపై నెలకోసారి సమావేశంలో చర్చించుకుంటారన్నారు. సమస్యలను జిల్లా కమిటీ ఛైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకొస్తారని సూచించారు. జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి మాట్లాడుతూ మహిళలు ధైర్యంగా సమస్యలను బహిర్గతం చేసి వాటిని పరిస్కరించుకోవాలన్నారు. వారికోసం షీటీంలు ఉన్నాయని చెప్పారు. సమస్యలుంటే కమిటీని ఆశ్రయించాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా మహిళలు 181 టోల్‌ఫ్రీనెంబరుకు ఫోన్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ అధికారిణి రాధమ్మ, జిల్లా రెవెన్యూ అధికారి మణిమాల, డిఎస్‌పి ప్రసన్నరాణి, ఆయా శాఖల అదికారులు పాల్గొన్నారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *