Breaking News

Daily Archives: October 12, 2017

అభివృద్ది పనులు ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి

  కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గురువారం నిజామాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేవారు. బోధన్‌ నియోజకవర్గం నవీపేట్‌లో రూ. 5 కోట్ల 9 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించారు. బోధన్‌లో రూ. 3.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ప్రారంభించారు. రూ. 2.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న డిగ్రీ కళాశాలకు భూమిపూజచేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ …

Read More »

రెండేళ్లలో పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన

  కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండేళ్లలోనే రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన నేతృత్వంలో గురువారం నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల జిల్లా స్థాయి విద్యాశాఖ సమావేశం నిర్వహించారు. విద్యాశాఖకు సంబంధించి విభాగాల వారిగా సమాచారం సేకరించారు. జిల్లాలో విద్యాశాఖ డిమాండ్లు, సమస్యలను ఎంపి కవిత, చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆయన దృష్టికి తీసుకెల్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికలు చదివే మోడల్‌ స్కూల్లు, …

Read More »

అన్ని స్థాయిల్లో విద్యాప్రమాణాలు పెంచుతాం

  కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని స్థాయిల్లో విద్యా ప్రమాణాలు పెంచుతామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌, నవీపేటలో గురువారం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం జరిగిన సభల్లో మంత్రి మాట్లాడారు. గత పాలకులు విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని, తెరాస ప్రభుత్వం దాన్ని సంస్కరిస్తుందన్నారు. గతంలో ఇబ్బడిముబ్బడిగా అర్హతలు లేకున్నా కళాశాలలకు అనుమతులు ఇచ్చారని, జివో 16 ప్రకారం కాంట్రాక్టు వారిని రెగ్యులరైజ్‌ చేస్తామంటే ప్రతిపక్షాలు …

Read More »

రైతులకు పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలి

  బీర్కూర్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రబుత్వం వెంటనే ఆదుకోవాలని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఆరుగాలం కష్టించిన రైతుకు చివరికి మిగిలింది కన్నీరేనని, ఎకరానికి 20 వేల చొప్పున ప్రభుత్వం రైతులకు పరిహారం అందించాలని ఆయన అన్నారు. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో …

Read More »

రైతులకు పరిహారం అందేలా చూస్తాం

  బీర్కూర్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారిణి కమల అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో, బీర్కూర్‌ గ్రామంలో గ్రామ సర్పంచ్‌ నర్సయ్యతో కలిసి పంట నష్ట తీవ్రతను పరిశీలించారు. రైతులు అధైర్యపడవద్దని, గతంలో పంట బీమా చేసుకున్నవారికి బీమా సౌకర్యం ప్రభుత్వం అందిస్తుందని, అంతేగాకుండా వరి పంట నష్టపోయిన రైతుల జాబితా తయారుచేసి ప్రభుత్వానికి నివేదిస్తామని ఆమె అన్నారు. ఏవో వెంట మున్నూరుకాపు …

Read More »

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదే

  కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటికిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని, మిగిలిన సమస్యలను పరిష్కరించాల్సిన బాద్యత ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఎంపి కవిత క్యాంపు కార్యాలయంలో గురువారం ఎంపి నేతృత్వంలో ఉపాధ్యాయ సంఘాలప్రతినిదులు ఉప ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలోలాగా కాకుండా ప్రస్తుతం పాఠశాలల ప్రారంభానికి ముందే యూనిఫాంలు, విద్యావాలంటీర్లు, స్కూల్‌ గ్రాంట్లు, పుస్తకాలు అందజేశామన్నారు. …

Read More »

అభివృద్దికి నోచుకోని ఎన్‌టిఆర్‌ కాలనీ

  నందిపేట, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ మండల కార్యాలయాల సముదాయానికి కూతవేటు దూరంలో ఎన్‌టిఆర్‌ కాలనీ ఉంది. 18 సంవత్సరాల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కాలనీ ఏర్పాటు చేసి 160 మంది పేదలకు ప్లాట్లు కేటాయించింది. అప్పుడు కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు, కానీ మరికొందరు అలాగే వదిలేశారు. ఎందుకంటే ఇల్లు కట్టుకున్నవారికే కష్టాలున్నాయని, ఇతరులు ముందుకు రావడం లేదు. కాలనీ ఏర్పడిన నాటినుంచి కనీసం రోడ్లు వేసిన దాఖలాలులేవు, సిమెంటు రోడ్డు, …

Read More »

దుమ్ములేపుతున్న రోడ్డు

  నందిపేట, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మెయిన్‌ రోడ్డు దుమ్ములేపుతుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రతి వర్షాకాలంలో అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలోని మెయిన్‌రోడ్డు గుంతలమయంగా మారడం, పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి ఆర్‌అండ్‌బి అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయడంతోనే సరిపెడుతున్నారు. అయితే ఈ సంవత్సరం పూర్తిగా చెడిపోయిన రోడ్డును తాత్కాలిక మరమ్మతుల కొరకు అధికారులు కంకర డస్టు వేసి గుంతలు పూడ్చి చేతులు దులుపుకున్నారు. దాంతో వాహనాలు వెళతున్నపుడు విపరీతమైన …

Read More »