అభివృద్ది పనులు ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి

 

కామారెడ్డి, అక్టోబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గురువారం నిజామాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేవారు. బోధన్‌ నియోజకవర్గం నవీపేట్‌లో రూ. 5 కోట్ల 9 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించారు. బోధన్‌లో రూ. 3.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ప్రారంభించారు. రూ. 2.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న డిగ్రీ కళాశాలకు భూమిపూజచేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎంపి కవిత, బోధన్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు షకీల్‌, రవిందర్‌రెడ్డి, ఇంటర్‌ విద్యా కమీషనర్‌ అశోక్‌, చీఫ్‌ ఇంజనీర్‌ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  – నగర మేయర్‌ ఆకుల సుజాత నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *