అన్ని స్థాయిల్లో విద్యాప్రమాణాలు పెంచుతాం

 

కామారెడ్డి, అక్టోబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని స్థాయిల్లో విద్యా ప్రమాణాలు పెంచుతామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌, నవీపేటలో గురువారం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం జరిగిన సభల్లో మంత్రి మాట్లాడారు. గత పాలకులు విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని, తెరాస ప్రభుత్వం దాన్ని సంస్కరిస్తుందన్నారు. గతంలో ఇబ్బడిముబ్బడిగా అర్హతలు లేకున్నా కళాశాలలకు అనుమతులు ఇచ్చారని, జివో 16 ప్రకారం కాంట్రాక్టు వారిని రెగ్యులరైజ్‌ చేస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, అందుకే వారికి మూలవేతనం పెంచామన్నారు. కెజి నుంచి పిజి ఉచిత విద్యలో భాగంగా 2016 అంబేడ్కర్‌ జయంతిన 525 గురుకుల పాఠశాలలను ప్రారంభించామన్నారు. మిషన్‌ భగీరథ, వాటర్‌ గ్రిడ్‌, కళ్యాణలక్ష్మి లాంటి పథకాలతో పాటు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న సర్కారు తెలంగాణలోనేనని చెప్పారు.

ఎంపి కవిత మాట్లాడుతూ గత పాలనలో బోధన్‌ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని పెద్ద పెద్ద నాయకులున్నా చేసిందేమి లేదన్నారు. మునిసిపాలిటికి నిధులు లేకపోవడంతో మంత్రి కెటిఆర్‌ను కోరితే 50 కోట్లు మంజూరుచేశారన్నారు. ఇక్కడే మూడురోజుల పాటు ఉండి ఎమ్మెల్యేతో కలిసి నిధులు ఎక్కడెక్కడ ఖర్చు చేయాలో నిర్ణయిస్తామన్నారు. ఇక్కడి యువకుల కోసం రూ. 7 కోట్లతో పదెకరాల్లో స్టేడియం నిర్మించుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎంపి కవిత, బోధన్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు షకీల్‌, రవిందర్‌రెడ్డి, ఇంటర్‌ విద్యా కమీషనర్‌ అశోక్‌, చీఫ్‌ ఇంజనీర్‌ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *