రెండేళ్లలో పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన

 

కామారెడ్డి, అక్టోబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండేళ్లలోనే రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన నేతృత్వంలో గురువారం నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల జిల్లా స్థాయి విద్యాశాఖ సమావేశం నిర్వహించారు. విద్యాశాఖకు సంబంధించి విభాగాల వారిగా సమాచారం సేకరించారు. జిల్లాలో విద్యాశాఖ డిమాండ్లు, సమస్యలను ఎంపి కవిత, చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆయన దృష్టికి తీసుకెల్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికలు చదివే మోడల్‌ స్కూల్లు, కెజిబివిలపై ప్రత్యేక శ్రద్ద వహించి సిసి కెమెరాలు, బయోమెట్రిక్‌, ఆర్‌వో ప్లాంటు, డిజిటల్‌ క్లాసెస్‌ ఏర్పాటు చేయాలన్నారు. వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న పాఠశాలలన్నింటి సమస్యలు తీర్చాలంటే 3 వేల కోట్లు అవసరమని, ఈయేడాది వీటికోసం 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైతం ఆశించిన స్థాయిలో పనిచేసి ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయాలని, ప్రభుత్వ విద్యకు పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు. కలెక్టర్‌ నిర్వహించే సమీక్షలో విద్య గురించి రివ్యు చేయడం లేదని, ఖచ్చితంగా రివ్యు చేయాలన్నారు. వచ్చే వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి కవిత, శాసనమండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌, పాఠశాల విద్యాడైరెక్టర్‌ కిషన్‌, కలెక్టర్లు రవిందర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  – నగర మేయర్‌ ఆకుల సుజాత నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *