ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదే

 

కామారెడ్డి, అక్టోబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటికిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని, మిగిలిన సమస్యలను పరిష్కరించాల్సిన బాద్యత ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఎంపి కవిత క్యాంపు కార్యాలయంలో గురువారం ఎంపి నేతృత్వంలో ఉపాధ్యాయ సంఘాలప్రతినిదులు ఉప ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలోలాగా కాకుండా ప్రస్తుతం పాఠశాలల ప్రారంభానికి ముందే యూనిఫాంలు, విద్యావాలంటీర్లు, స్కూల్‌ గ్రాంట్లు, పుస్తకాలు అందజేశామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు బాగా పనిచేసి ముఖ్యమంత్రి ఆశించినట్టు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచాలని, విద్యార్థుల నమోదు పెంచాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మీద సమష్టిగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకురావాలని, పేద పిల్లలకు న్యాయంచేయాలని కోరారు.

Check Also

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  – నగర మేయర్‌ ఆకుల సుజాత నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *