రైతులకు పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలి

 

బీర్కూర్‌, అక్టోబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రబుత్వం వెంటనే ఆదుకోవాలని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఆరుగాలం కష్టించిన రైతుకు చివరికి మిగిలింది కన్నీరేనని, ఎకరానికి 20 వేల చొప్పున ప్రభుత్వం రైతులకు పరిహారం అందించాలని ఆయన అన్నారు. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పోగు నారాయణ, బాన్సువాడ నియోజకవర్గపు యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ హైమద్‌, తదితరులున్నారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *