అభివృద్దికి నోచుకోని ఎన్‌టిఆర్‌ కాలనీ

 

నందిపేట, అక్టోబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ మండల కార్యాలయాల సముదాయానికి కూతవేటు దూరంలో ఎన్‌టిఆర్‌ కాలనీ ఉంది. 18 సంవత్సరాల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కాలనీ ఏర్పాటు చేసి 160 మంది పేదలకు ప్లాట్లు కేటాయించింది. అప్పుడు కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు, కానీ మరికొందరు అలాగే వదిలేశారు. ఎందుకంటే ఇల్లు కట్టుకున్నవారికే కష్టాలున్నాయని, ఇతరులు ముందుకు రావడం లేదు. కాలనీ ఏర్పడిన నాటినుంచి కనీసం రోడ్లు వేసిన దాఖలాలులేవు, సిమెంటు రోడ్డు, డ్రైనేజీలు వారు ఎరుగరు. దీంతో వర్షాకాలంలో చినుకు పడితే కాలు బయటపెట్టలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజాప్రతినిదులు గానీ, అధికారులుగానీ కాలనీని సందర్శించిన సందర్భాలు లేవని, ఎన్నికలపుడే అన్ని పార్టీల వారు వస్తారుకానీ, ఇపుడు ఎవరు రారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాలనీ మొత్తానికి మురికి గుంతలో ఉన్న జెట్‌పంపు ఒకటే ఉంది. వాటినే తాగడానికి ఇతరత్రా అవసరాలకు అందరు ఉపయోగించుకుంటున్నారు. తద్వారా రోగాల బారిన పడుతున్నారు. అదే కాలనీలో అధికార పార్టీ నాయకుడు ఉంటారు కానీ ఒక్కరోజు కూడా తమ కాలనీ సమస్య గురించి గ్రామ పంచాయతీలోగాని, మండల సమావేశంలో చర్చించలేదని ప్రజలు అంటున్నారు. గతంలో ఎన్నోసార్లు కాలనీవాసులందరు కలిసి మండల అధికారులకు అనేక సమస్యలు విన్నవించినా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని, ఇకనైనా అదికారులు, ప్రజాప్రతినిదులు కాలనీ బాగుచేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Check Also

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  – నగర మేయర్‌ ఆకుల సుజాత నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *