దుమ్ములేపుతున్న రోడ్డు

 

నందిపేట, అక్టోబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మెయిన్‌ రోడ్డు దుమ్ములేపుతుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రతి వర్షాకాలంలో అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలోని మెయిన్‌రోడ్డు గుంతలమయంగా మారడం, పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి ఆర్‌అండ్‌బి అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయడంతోనే సరిపెడుతున్నారు. అయితే ఈ సంవత్సరం పూర్తిగా చెడిపోయిన రోడ్డును తాత్కాలిక మరమ్మతుల కొరకు అధికారులు కంకర డస్టు వేసి గుంతలు పూడ్చి చేతులు దులుపుకున్నారు. దాంతో వాహనాలు వెళతున్నపుడు విపరీతమైన దుమ్ములేచి వెనక ఉన్న ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాలు వెళ్లినుపుడు లేచిన దుమ్ము రోడ్డుపక్కన గల దుకాణదారుల మడిగెల వరకు వస్తుంది. దాంతో దుకాణదారులు వ్యాధుల బారిన పడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తార్‌రోడ్డు వేయించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *