Breaking News

రైతులకు పరిహారం అందేలా చూస్తాం

 

బీర్కూర్‌, అక్టోబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారిణి కమల అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో, బీర్కూర్‌ గ్రామంలో గ్రామ సర్పంచ్‌ నర్సయ్యతో కలిసి పంట నష్ట తీవ్రతను పరిశీలించారు. రైతులు అధైర్యపడవద్దని, గతంలో పంట బీమా చేసుకున్నవారికి బీమా సౌకర్యం ప్రభుత్వం అందిస్తుందని, అంతేగాకుండా వరి పంట నష్టపోయిన రైతుల జాబితా తయారుచేసి ప్రభుత్వానికి నివేదిస్తామని ఆమె అన్నారు. ఏవో వెంట మున్నూరుకాపు మండల అధ్యక్షుడు అవారి గంగారాం, గ్రామస్తులు ఉన్నారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *