Breaking News

Daily Archives: October 14, 2017

ధాన్యాన్ని దళారుల పాలు చేయొద్దు

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీర్కూర్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు అమ్మి రైతులు నష్టపోవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్‌ కమిటీలో శనివారం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు అతి తక్కువ ధరకు ధాన్యాన్ని …

Read More »

రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే ఆందోళన తప్పదు

  బీర్కూర్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్సాభావ పరిస్థితుల ప్రభావం కారణంగా బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వరిపంట నేలకొరిగిందని, అటువంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, అట్టి రైతులకు న్యాయం చేయకపోతే కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆందోళన చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ బాన్సువాడ నియోజకవర్గపు ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజ్‌ అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని నెమ్లి గ్రామంలో శనివారం పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంట పొలాల్లోకెళ్ళి పంట నష్టం తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా …

Read More »

తెలంగాణ తిరుమల ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు

  బీర్కూర్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన వెంట ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఉన్నారు.

Read More »

గళగళగళ గోదారి…

  నందిపేట, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోదావరికి వరద పోటెత్తుతుంది. గత నాలుగైదు రోజులుగా ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని ఉమ్మెడ, బాద్గుణ, నికాల్‌పూర్‌, డొంకేశ్వర్‌, గాదేపల్లి, మారంపల్లిగ్రామ శివారుల్లో గోదావరి నది జలకళను సంతరించుకుంటుంది. ఈ వర్షాకాలంలో ఇటు తెలంగాణలోను, అటు మహారాష్ట్రలో వరద నీరులేక రోజురోజుకు తగ్గుతున్న నీటి మట్టం చూసి వచ్చే వేసవిలో కష్టాలు తప్పవని భావిస్తున్న తరుణంలో రైతాంగానికి ఉపశమనం కలిగింది. జిల్లాలోని బాల్కొండ మండలంలోని పోచంపాడ్‌లోగల …

Read More »

అదృశ్యమైన హాస్టల్‌ విద్యార్థులు లభ్యం

  – క్షేమంగా రావడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు నందిపేట, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని ఎస్‌సి వసతి గృహంలో ఉంటున్న విష్ణు, వినయ్‌ అనే విద్యార్థులు ఈనెల 10వ తేదీన వసతి గృహ ం నుంచి పాఠశాలకు వెళుతున్నామని చెప్పి అదృశ్యమయ్యారు. అయితే శనివారం మండల కేంద్రానికి రావడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ కథనం ప్రకారం…. 9వ తరగతి చదువుతున్న విష్ణు, వినయ్‌లు తాము ఉంటున్న వసతి గృహం నుంచి చదువుకుంటున్న పాఠశాలకు …

Read More »

పకడ్బందీగా రికార్డుల ప్రక్షాళన

  నందిపేట, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని నందిపేట తహసీల్దార్‌ ఉమాకాంత్‌ అన్నారు. మండలంలో గత 15 రోజుల నుంచి వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేలో భాగంగా శనివారం నికాల్‌పూర్‌, ఐలాపూర్‌ గ్రామాల్లో తహసీల్దార్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసమస్యలు పరిస్కరించుకోవడానికి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన మంచి అవకాశమన్నారు. సరైన దృవపత్రాలు అందజేసి అధికారులకు సహకరించాలన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని …

Read More »