Breaking News

Daily Archives: October 16, 2017

డయల్‌ యువర్‌ ఎస్‌పిలో 5 ఫిర్యాదులు

  కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో డయల్‌ యువర్‌ ఎస్‌పి కార్యక్రమంలో ప్రజల నుంచి 5 ఫిర్యాదులు అందినట్టు జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి తెలిపారు. ఇందులో కామరెడ్డి-1, మాచారెడ్డి-1, దేవునిపల్లి-1, ఎల్లారెడ్డి-1, లింగంపేట్‌-1 స్టేషన్ల పరిధిలో ఫిర్యాదు అందాయన్నారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు ఆదేశించినట్టు ఎస్‌పి అన్నారు.

Read More »

టియుడబ్ల్యుజెయు కార్యవర్గం ఎన్నిక

  కామరెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉర్దూ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌ టియుడబ్ల్యుజెయు కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా సయ్యద్‌ అన్వర్‌, ఉపాధ్యక్షుడుగా మహ్మద్‌ నిజాముద్దీన్‌, ఎం.ఎ. ఖాలెక్‌, ప్రధాన కార్యదర్శిగా మహ్మద్‌ అలీముద్దీన్‌, సహ కార్యదర్శిగా మహ్మద్‌ ముకరం, కోశాధికారి ఎంఎ. రహమాన్‌, ఇసి సభ్యులుగా మహ్మద్‌ అశ్వక్‌, అబ్దుల్‌ హైమద్‌ ఇర్ఫాన్‌, హనీఫ్‌, రషీద్‌లు ఎన్నికయ్యారు. ఎన్నికల్లో రాష్ట్ర కమిటీ నాయకులు సాజిద్‌, మోయిన్‌, అహ్మద్‌ గిలానీ, హకీం, లాయికుద్దీన్‌, …

Read More »

రుగ్మతల నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజంలో పలు రకాల అవాంఛనీయ రుగ్మతలు వస్తున్నాయని, వీటిని నియంత్రించడంలో అందరూ భాగస్వాములు కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. జనహిత భవనంలో సోమవారం బతుకమ్మ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించిన అధికారులను ఆయన సన్మానించారు. జిల్లా రెవెన్యూ అధికారి మనిమాల, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, బిసి సంక్షేమ శాఖాధికారి దేవిదాస్‌, ఆర్‌అండ్‌బి ఇఇ అంజయ్య, డిఇవో మదన్‌మోహన్‌, టిపివో శ్రీనివాస్‌, ఐసిడిఎస్‌ పిడి రాధమ్మ, వ్యాఖ్యత మనోహర్‌రావు, డిఎస్‌వో …

Read More »

పోచారం ప్రాజెక్టు ఎత్తును పెంచాలని కలెక్టర్‌కు వినతి

  కామరెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోచారం ప్రాజెక్టు ఎత్తును 5 ఫీట్లు పెంచి ఆయకట్టును రక్షించాలని సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నాగిరెడ్డిపేట రైతులు, ఆయా పార్టీల నాయకులు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోచారం ప్రాజెక్టు నిర్మించి సుమారు 100 సంవత్సరాలు కావస్తుందని, ఇప్పటి వరకు ప్రాజెక్టు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదన్నారు. ఇన్నేళ్ళుగా పూడిక ఏర్పడి 2.216 టిఎంసిల సామర్థ్యమున్న ప్రాజెక్టు 1.5 టిఎంసిలకు పడిపోయిందన్నారు. దీనివల్ల రైతులకు నీటి సౌకర్యం …

Read More »

డిసెంబరు 15 లోగా ఓడిఎఫ్‌గా ప్రకటించేలా చర్యలు

  కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు స్వచ్చభారత్‌ ద్వారా డిసెంబరు 15 లోగా ఓడిఎఫ్‌ గా ప్రకటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కామారెడ్డి జనహితలో సోమవారం అన్ని శాఖల సమన్వయ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా ఏర్పాటైన తర్వాత ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ద్వారా 120 గ్రామ పంచాయతీల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, ప్రస్తుతం స్వచ్చభారత్‌ మిషన్‌ ద్వారా 189 గ్రామాల్లో పూర్తిచేసేందుకు కావాల్సిన నిధులు, సామగ్రి, వనరులు ఉన్నాయన్నారు. …

Read More »

ప్రజావాణిలో 95 ఫిర్యాదులు

  కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలో జనహిత సమీకృత ఫిర్యాదుల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 95 ఫిర్యాదుల అందినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి నేరుగా పిర్యాదులు స్వీకరించినట్టు తెలిపారు. ఇందులో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 22, పంచాయతీరాజ్‌శాఖ-7, గ్రామీణాభివృద్ది శాఖ-7 సంబంధించినవని, మిగతావి వివిద శాఖలకు సంబంధించినవని తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు …

Read More »

పొంగుతున్న నల్లవాగు మత్తడి

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గ్రామ శివారులోగల నల్లవాగు మత్తడి నీటి ఉధృతి ఎక్కువై పొంగి పొర్లుతుంది. మత్తడి ఎగువ ప్రాంతంలోగల సంగారెడ్డి జిల్లా మాసన్‌పల్లి, కల్హేర్‌, నల్లవాగు, సిర్గాపూర్‌ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నల్లవాగు మత్తడి నీటి ప్రవాహంతో పొంగి పొర్లుతుంది. నీరంతా గోదావరిలోకి వృధాగా పోతుంది.

Read More »

ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలి

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గ్రామంలో ముదిరాజ్‌ల సంఘం సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు విఠల్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్‌ కులస్తులందరికి మత్స్యకార్మికుల సంఘం సభ్యత్వ నమోదు ఇప్పించాలని అన్నారు. ముదిరాజ్‌ కులస్తులకు న్యాయం జరిగేందుకు ఐకమత్యంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్‌ల కోసం బిసి కార్పొరేషన్‌లు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో, జిల్లాలో ముదిరాజ్‌ కులస్తులందరికి కమ్యూనిటి భవనం మంజూరుకు …

Read More »

పంటకు దోమపోటు

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌లో పంట వేసుకున్న రైతులకు ఒకవైపు వర్షాలు, మరోవైపు దోమపోటు రోగాలుసోకి రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట, నర్సింగ్‌రావుపల్లి, హసన్‌పల్లి, కోమలంచ తదితర గ్రామాల్లో వరిపైరుకు దోమపోటు సోకడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయాధికారులు సైతం వాటిపై ఎలాంటి సూచనలు చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వ్యవసాయాధికారులు ఇచ్చిన సలహాల మేరకు వేలాది రూపాయలు వెచ్చించి మందులు పిచికారి చేయడంతో రోగం మరింత పెరిగిందని అన్నారు. మండలంలోని …

Read More »

నిజాంసాగర్‌లోకి భారీగా వరదనీరు

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుందని ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు వరప్రదాయినిగా నిలుస్తున్న నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయంలోకి నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టిఎంసిలకుగాను 8.55 టిఎంసిల నీరు వచ్చి చేరిందని డిప్యూటి ఇఇ దత్తాత్రి తెలిపారు. సింగూరు జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 1460 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో విద్యుత్‌ ఉత్పాదనతోపాటు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరదనీరు …

Read More »