Breaking News

Daily Archives: October 25, 2017

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వినతి

  కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు కేటాయించాలని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్‌ జర్నలిస్టులందరికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బాపురావు, ప్రతినిదులు కుమారస్వామి, శివకుమార్‌, భాస్కర్‌, బాబురావు, రాజేందర్‌, వీరప్రభు, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా ధన్వంతరి జయంతి

  కామరెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రయివేటు మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో పట్టణంలోని భూపుత్రమ్మ కళ్యాణమండపంలో ధన్వంతరి జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్‌ఎంపి, పిఎంపిల సేవలు గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం మోహన్‌, మండల అధ్యక్షుడు బాల్‌కిషన్‌గౌడ్‌, జడ్పిటిసి నిమ్మ మోహన్‌రెడ్డి, ప్రతినిధులు విఠల్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిస్కరించాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బిఎన్‌ఆర్‌కెఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ మేరకు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలోని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారికి గిట్టుబాటు ధర, పింఛన్‌, వెల్పేర్‌ బోర్డు నుంచి ఉపాధి హామీ, ఇఎస్‌ఐ, ప్రమాదబీమా తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాన రంగ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు సతీష్‌, …

Read More »

ఆర్‌టిసి డిపో ఎదుట కార్మికుల ధర్నా

  కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్‌టిసి డిపో కార్యాలయం ఎదుట తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డిపో సెక్రెటరీ నారాయణ, అధ్యక్షులు రంజిత్‌రెడ్డిలు మాట్లాడుతూ వేతన సవరణ జాప్యం చేస్తున్నందున రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ధర్నా చేపట్టినట్టు తెలిపారు. కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో హరినాథ్‌, రెడ్డి, సంగారెడ్డి, మూర్తి, స్వామి, దేవేందర్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Read More »

డిఆర్‌సి సమావేశంలో పలు శాఖలపై సమీక్ష

  కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన డిఆర్‌సి సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలు, వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు 4 వేలు అందించడానికి క్షేత్ర స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ఆన్‌లైన్‌ పహాని పూర్తిచేయాలన్నారు. రైతు సమగ్ర సర్వే ద్వారా రైతులకు వరి విత్తనాలు ఆన్‌లైన్‌లో పంపిస్తామన్నారు. 80 శాతం పంటల రుణాలకు 669 కోట్లు లక్ష్యంగా …

Read More »

రైతులకు పంటలపై అవగాహన కల్పించాలి

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు వివిధ రకాల పంటలపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలని, సరైన సమయంలో విత్తనాలు సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో బుధవారం వ్యవసాయ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ క్లస్టర్‌ వారిగా గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబరు నాటికి వరినాట్లు పడేవిధంగా …

Read More »

పేదల పక్షపాతి సిఎం కెసిఆర్‌

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేదల పక్షపాతి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వర్ని మండలం అక్బర్‌నగర్‌లో బుధవారం జరిగిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ గృహప్రవేశం సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రతి మనిషికి సొంత ఇల్లు ఒక కల అని, ఈరోజుల్లో సొంత ఇల్లు కట్టుకోవడమంటే గగనమైపోయిందని, ముఖ్యంగా పేదలకు సొంత ఇల్లు కలలాగే మిగిలిపోయేదని, …

Read More »

నెంబర్‌ నహితో నహి చలేగా…

  నందిపేట, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మీరు కొత్త వాహనం కొనుగోలు చేశారా? బైక్‌పై నెంబర్‌ ప్లేట్‌ లేదా, నెంబరు రాయించలేదా? అయితే వెంటనే రాయించుకోండి లేదంటే పోలీసులు వాహనం సీజ్‌ చేస్తారు. జిల్లా పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు నందిపేట పోలీసులు వాహనాలు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఇందుకోసం ఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతిరోజు వాహనాలు తనిఖీచేస్తు దృవపత్రాలు లేనివారికి, హెల్మెట్లు లేనివారికి, నెంబరు ప్లేట్‌ లేనివారికి జరిమానాలు విధిస్తున్నారు. లైసెన్సులు లేకుండా …

Read More »

రక్తదాన శిబిరానికి విశేష స్పందన

  నందిపేట, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల పరిషత్‌ కార్యాలయంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. యువకులు, ప్రజలు స్వచ్చందంగా వచ్చి రక్తదానం చేశారు. మొత్తం 58 మంది పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఉమాకాంత్‌రావు, మండల పరిషత్‌ అధికారి నాగవర్ధన్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పాల్గొన్నారు.

Read More »

గీత కార్మికులకు లైసెన్సులు మంజూరు చేయాలి

  నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో అర్హులైన గీత కార్మికులకు కొత్త లైసెన్సులు మంజూరు చేయాలని జిల్లా గౌడ సంఘం కార్యదర్శి చెరుకూరి లక్ష్మణ్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు బుధవారం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎక్సైజ్‌ అధికారులు గీత కార్మికుల పట్ల నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తున్నారని, లైసెన్సులు పునరుద్దరించకుండా గీత కార్మికులకు ఆంక్షలు విధిస్తూ వారిని మానసికంగా వేదిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొంతమంది అవినీతి …

Read More »