Breaking News

భూ రికార్డుల ప్రక్షాళనలో రాష్ట్రంలో జిల్లాకు రెండోస్థానం

 

కామారెడ్డి, అక్టోబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలోకామారెడ్డి జిల్లా 96వ శాతంతో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆర్‌డివో కార్యాలయంలో జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపిడివోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, హరితహారం, ఓడిఎఫ్‌, గొర్రెల పంపిణీ, కెసిఆర్‌ కిట్‌, డంపింగ్‌ యార్డులు, ధాన్యం కొనుగోలు తదితర కార్యక్రమాలపై మండలాల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రక్షాళన కార్యక్రమంలో అధికారుల పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకోవాలని సూచించారు. ఓడిఎఫ్‌ను గ్రామాల్లో వందశాతం పూర్తిచేయాలని సూచించారు. విద్యార్థుల్లో చేతుల శుభ్రతపై అవగాహన పెంచాలన్నారు. గొర్రెల పంపిణీ 56 శాతం పూర్తయిందని, ఒకటిన్నర నెలలో మిగతా లక్ష్యాన్ని పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, డిఎఫ్‌వో బాలమణి, డిఇవో మదన్‌మోహన్‌, ఇఇ ఆర్‌డబ్ల్యుఎస్‌ వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్‌ అధికారిణి రాధమ్మ, ఎడి ఉద్యానశాఖ శేఖర్‌, బిసి, ఎస్‌సి సంక్షేమాధికారులు అంజయ్య, దేవిదాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రక్తనిల్వ‌లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రక్తదాతల‌ సమూహం పిలుపు మేరకు మంగళవారం కామారెడ్డి ...

Comment on the article