Breaking News

Monthly Archives: November 2017

యువత ఆలోచనాత్మకంగా మెలగాలి

  కామరెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజ నిర్మాణం పటిష్టంగా ఉండాలంటే యువత ఆలోచనాత్మకంగా మెలగాలని పాజిటివ్‌ ఆలోచనలు పెంపొందించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్తాయి యువజనోత్సవాలు-2017 పోటీలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ స్వామి వివేకానంద ఉద్బోదించిన విధంగా యువతే దేశానికి వెన్నెముక అని వారు వజ్ర సంకల్పం కలిగి ఉండాలని, దిల్‌, ధిమాక్‌, …

Read More »

మహాపడిపూజకు హాజరుకావాలని షబ్బీర్‌కు ఆహ్వానం

  కామరెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో డిసెంబరు 6న నిర్వహించనున్న మహాపడిపూజ మహోత్సవానికి హాజరు కావాలని అయ్యప్పదీక్ష స్వాములు గురువారం శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీని హైదరాబాద్‌లో కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 18వ దీక్షా మాలధారణ సందర్భంగా స్వర్ణాభిషిక్త ధర్మశాస్త మహా పడిపూజ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్‌లో డిసెంబరు 6న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు శంఖారావం, వేద పారాయణం, మహాపడిపూజ తదితర …

Read More »

కర్షక్‌లో ఘనంగా ఆర్ట్‌, డ్రామా ముగింపు వేడుకలు

  కామరెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్‌ బిఇడి కళాశాలలో గురువారం ఆర్ట్‌, డ్రామా ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఇడి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వివిద కళలను ప్రదర్శించారు. భక్త సిరియాల, భక్త రామదాసు, అమ్మోరు, నల్లపోచమ్మ జననం, తదితర పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగ ప్రాజెక్టు ఇన్‌చార్జి రామ్మోహన్‌ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్దతో ఆర్ట్‌, డ్రామా ప్రాజెక్టు కళాత్మకంగా పూర్తిచేయడం అభినందనీయమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌రషీద్‌ మాట్లాడుతూ భూమిపై …

Read More »

డిసెంబరు 30 లోగా జిల్లాను ఓడిఎఫ్‌గా ప్రకటించుకుందాం

  కామరెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబరు 30 లోగా జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడిఎఫ్‌గా ప్రకటించుకుందామని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ స్వచ్చ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో 90 గ్రామాలకు సంబంధించి సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులకు ఓడిఎఫ్‌పై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబరు 20 లోగా అన్ని గ్రామాల్లో ఓడిఎఫ్‌ పనులు పూర్తికావాలని, ఇందుకు సర్పంచ్‌లు, పంచాయతీ సిబ్బంది చురుకుగా పనిచేయాలన్నారు. పరిశుభ్రత సమాజం …

Read More »

9న రహెమ్మతుల్‌ లీల్‌ ఆలమీన్‌ లయే అంశంపై బహిరంగసభ

  కామరెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రబ్బ ఉల్‌ అన్వల్‌ మాసాన్ని పురస్కరించుకొని డిసెంబరు 9న రహెమ్మతుల్‌ లీల్‌ ఆలమీన్‌ లయే అంశంపై బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు ప్రెస్‌ సెక్రెటరీ జిమయతుల్‌ ఉలేమా మోహ్మద్‌ ఫెరోజ్‌ ఉద్దీన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తేదీన సాయంత్రం 8 గంటలకు కామరెడ్డి సైలానీబాబా కాలనీలోగల లిమ్రా గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో సభ ఉంటుందని, జమీయతుల్‌ ఉలేమా ఎ హింద్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తీ గీయాసుద్దీన్‌ సాహబ్‌ సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారని అన్నారు. అలాగే …

Read More »

భూ కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలి

  కామరెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులకు సంబంధించి కోర్టుకు తప్పుడు దృవపత్రాలు సమర్పించిన భూ కబ్జాదారులు, వారికి సహకరించిన అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల జేఏసి ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. కళాశాల ఆస్తులను కాపాడుకునేందుకు విద్యార్థి సంఘాలు ఏళ్ళుగా అనేక దఫాలుగా పోరాటాలు నిర్వహించి కళాశాల పేరిట ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నామన్నారు. ఇటీవల కొందరు ప్రయివేటు వ్యక్తులు బడా …

Read More »

ఛాత్రోపాధ్యాయులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

  కామరెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛాత్రోపాధ్యాయులు నైపుణ్యాలు పెంపొందించుకున్నప్పుడే ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారని జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి గంగాకిషన్‌ అన్నారు. హైమద్‌ కళాశాలలో టిటిసి మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రముఖ గణితశాస్త్ర ఉపాధ్యాయుడు, జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి గంగాకిషన్‌ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం అభ్యసనం చేసినపుడే నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చన్నారు. ఆ దిశగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ బాలు, అధ్యాపకులు …

Read More »

రహదారి దుమ్ము దుమ్ము

  నిజాంసాగర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారిగా మారనున్న బోధన్‌-హైదరాబాద్‌ రహదారి ప్రయాణం నరకయాతనగా మారింది. అడుగడుగునా గుంతలతో ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేసినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిజాంసాగర్‌ బొగ్గుగుడిసె చౌరస్తా, మహ్మద్‌నగర్‌, కొత్తబాది వరకు ఉన్న 30 కి.మీ.ల ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. ఈ రహదారి మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు మంజూర చేసినా పనులు మాత్రం నత్తనడకన …

Read More »

సమస్యలు పరిష్కరించాలని ఐకెపి ఉద్యోగుల భిక్షాటన

  నిజాంసాగర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐకెపి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎపిఎం రాంనారాయణగౌడ్‌, సిబ్బంది మండలంలోని కోమలంచ, నిజాంసాగర్‌, అచ్చంపేట గ్రామాల్లో గురువారం భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఐకెపి ఉద్యోగులకు గ్రామ సమాఖ్య సంఘాల వారు సంఘీభావం తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిస్కరించాలని డిమాండ్‌ చేస్తు సమ్మెచేస్తున్న ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో అమలయ్యేలా …

Read More »

32వ రోజుకు చేరిన సెర్ప్‌ ఉద్యోగుల సమ్మె

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగుల్ని క్రమబద్దీకరించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ – ఐకెపి ఉద్యోగుల సమ్మె గురువారంతో 32వ రోజుకు చేరింది. గురువారం సమ్మెనుద్దేశించి ఐకెపి జేఏసి కన్వీనర్‌ మారుతి మాట్లాడుతూ దీక్ష చేపట్టి 32 రోజులైనా ఏ అధికారికానీ, నాయకులు పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న పాలకులు అసలు ఆ విషయం మరిచిపోయారని, సకల జనుల సమ్మె, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన తమను ప్రభుత్వం …

Read More »