Breaking News

మత్స్యకార్మికుల అభివృద్దికి ప్రభుత్వం కృషి

 

నిజాంసాగర్‌, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్యకార్మికుల అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా అభివృద్ది చేస్తుందని కార్మిక పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలోని 3 కోట్ల 42 లక్షలు, నిజామాబాద్‌ జిల్లాలో 3 కోట్ల 45 లక్షల చేప పిల్లలను చెరువులు, జలాశయాల్లో విడుదల చేసేందుకు లక్ష్యం నిర్ణయించుకున్నట్టు తెలిపారు. నిజాంసాగర్‌, కౌలాస్‌, శ్రీరాంసాగర్‌ జలాశయాలతో పాటు చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో మత్స్యకార్మి వృత్తి అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్‌ 61 కోట్లు నిధులు మంజూరుచేశారన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని మత్స్య కార్మికుల అభివృద్ది కోసం ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *