Breaking News

ఆన్‌లైన్‌ జూదంపై ఉక్కుపాదం మోపాలి

 

– అసెంబ్లీలో ఎమ్మెల్యే బిగాల

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌ జూదంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరమెంతైనా ఉందని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కెసిఆర్‌ జూదాన్ని, పేకాట క్లబ్బులను పూర్తిగా నిషేదించారని, కానీ మారుతున్న కాలంతోపాటు టెక్నాలజీ కూడా మారిందని, కొందరు సంఘవిద్రోహ శక్తులు టెక్నాలజీని వాడుకొని ఆన్‌లైన్‌ జూదాన్ని నిర్వహిస్తున్నారని, దీనివల్ల యువతపై చెడు ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ విషయమై చట్ట సవరణలు చేసి ఆన్‌లైన్‌ జూదంపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే అన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *