భూ ప్రక్షాళనను త్వరితగతిన పూర్తిచేయాలి

 

కామారెడ్డి, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ భూ రికార్డుల ప్రక్షాళనను త్వరితగతిన పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. ప్రక్షాళనపై సోమవారం కలెక్టర్‌ చాంబరులో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ యంత్రాంగం ప్రతి టీం మెంబరు 200 సర్వే నెంబర్లు పూర్తిచేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబరు 15 నాటికి మాన్యువల్‌గా జాబితాలు సిద్దం చేయాలన్నారు. గాంధారి, జుక్కల్‌, పిట్లం, తదితర మండలాల్లో ఎల్‌ఆర్‌యుపి తక్కువగా నమోదైందని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కజొన్న పంటకు నిజాంసాగర్‌ నుంచి నీటి విడుదల చేయాలన్నారు. రాయితీపై విత్తనాలను పంపిణీ చేయాలని సూచించారు. డిసెంబరు 19 నాటికి ఓడిఎఫ్‌ పూర్తిచేయాలని ఆదేశించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, హరితహారం, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి ప్రగతి పనులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను, దేవేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *