Breaking News

కొనసాగుతున్న నీటి విడుదల

 

నిజాంసాగర్‌, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌, ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదల 4వ రోజుకు చేరుకుంది. ప్రాజెక్టు 12వ గేట్ల వద్ద 6వ, 7వ, 9వ, 10వ నాలుగు వరద గేట్లు ఎత్తి దిగువ మంజీరలోకి నీటిని విడుదల చేస్తున్నట్టు నీటిపారుదల శాఖాధికారులు తెలిపారు. 16 వేల 803 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి రావడంతో గేట్ల ద్వారా 16 వేల188 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని డిఇ దత్తాత్రి తెలిపారు. అలాగే ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 375 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేయడంతో 6వ, 7వ గేట్ల ద్వారా 17 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, అలాగే జెననకో గేట్ల ద్వారా 1363 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టులో నీటి మట్టం అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నిజాంసాగర్‌ నుండి మంజీరలోకి నీటివిడుదల చేస్తున్న నేపథ్యంలో మంజీర పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు నదిలోనికి వెళ్లవద్దని అధికారులు సూచించారు.

Check Also

భోజన వసతి కల్పించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *