Breaking News

15వ రోజుకు చేరిన సెర్ప్‌ – ఐకెపి ఉద్యోగుల సమ్మె

 

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని సెర్ప్‌-ఐకెపి ఉద్యోగుల సమ్మె సోమవారం నాటికి 15వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఉద్యోగులందరు కలెక్టర్‌ కార్యాలయం నుండి మాధవనగర్‌ సాయిబాబా ఆలయం వరకు పాదయాత్రగా వెళ్ళి ఆలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ మనసు మారి తమ న్యాయమైన డిమాండ్లు ఒప్పుకునేలా చేయాలని బాబాను ప్రార్థించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకొనే మార్గమధ్యంలో ఆర్యనగర్‌లోగల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అదేవిధంగా ఫూలాంగ్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహనికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సెర్ప్‌ జేఏసి నాయకులు మారుతి, ఎం.శ్రీనివాస్‌, డి.ప్రసాద్‌రావు, పి.శ్రీనివాస్‌, రవి, విజయలక్ష్మి, మాణిక్యం, శ్యాం, భూమేశ్వర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *