Breaking News

డిసెంబరు నాటికి వందశాతం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తిచేయాలి

 

కామారెడ్డి, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో డిసెంబరు నాటికి వందశాతం భూ రికార్డుల ప్రక్షాళన పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన సదాశివనగర్‌ మండలం దగ్గి గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దగ్గి గ్రామంలో ప్రక్షాళన కార్యక్రమం పదిరోజుల వరకు కొనసాగుతుందని, ఎలాంటి భూ సమస్యలు వచ్చినా వందశాతం ఆన్‌లైన్‌ పహానీ నిర్వహించాలన్నారు. అందరికి ముందస్తు సమాచారం అందించి సమన్వయ కమిటీ ద్వారా చర్చించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో సదాశివనగర్‌ తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌, వైస్‌ ఎంపిపి ఉపేందర్‌, ఆర్‌ఐ విద్యాసాగర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ తిరుమల్‌రావు, విఆర్వో గణేష్‌, సర్పంచ్‌సునంద, ఉపసర్పంచ్‌ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *