Breaking News

భాజపా నేతపై కేసు నమోదు చేయాలి

 

కామారెడ్డి, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బిజెపి నాయకుడు భరత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నర్సింహారెడ్డి, సిపిఎం నాయకులు రాములు డిమాండ్‌ చేశారు. మంగళవారం సిపిఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నవీపేట మండలం అభంగపట్నం గ్రామానికి చెందిన దళితులు రాజేశ్వర్‌, లక్ష్మణ్‌పై భరత్‌రెడ్డి దాడిచేసిన సంఘటనపై పోలీసు అదికారులు విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు దశరథ్‌, బాల్‌రాజు, భానుప్రసాద్‌, తదితరులు ఉన్నారు.

Check Also

భోజన వసతి కల్పించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *