Breaking News

ఘనంగా బాలల దినోత్సవం

 

కామారెడ్డి, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో మంగళవారం ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థుల వేషధారణ ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఆకట్టుకుంది. ఆయా పాఠశాలల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బాలల దినోత్సవ వేడుకలు జరిపారు. కార్యక్రమాల్లో మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, పద్మ రాంకుమార్‌గౌడ్‌, ప్రభాకర్‌, రేణుక, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *