Breaking News

గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్‌

 

కామరెడ్డి, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 50వ గ్రంథాలయ వారోత్సవ వేడుకలను మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించారు. కోర్టు రోడ్డులోగల గ్రంథాలయ భవనంలో గ్రంథాలయానికి సంబంధించిన జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రంథాలయాలు దేశ భవిష్యత్తుతోపాటు నిరుద్యోగ యువతకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ సంపత్‌గౌడ్‌, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, సభ్యులు మోహన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేశ్‌బాబు, తదితరులున్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *