అంగట్లో అత్యాచార వీడియోల విక్రయం…

లక్నో : ఓ యువకుడు అమ్మాయిపై అత్యాచారం చేస్తుండగా…ఆ దృశ్యాలను మరో యువకుడు చిత్రీకరించిన వీడియోలను కొందరు వ్యాపారులు అంగట్లో ‘లోకల్ ఫిలిం’పేరిట యథేచ్చగా విక్రయిస్తున్నారు. యువకులు, విద్యార్థుల్లో రేప్ వీడియోలకు డిమాండు పెరగడంతో కొందరు వ్యాపారులు గుట్టుగా వీటిని లోకల్ ఫిలిమ్స్ పేరిట పెన్ డ్రైవ్‌లలో వేసి విక్రయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలోని ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయిస్తున్న నాకా హిందోళ మార్కెట్ లో రేప్ వీడియోల విక్రయం జోరుగా సాగుతోంది. తెలతెలవారక ముందే నాకా హిందోళ మార్కెట్ లో సగం తెరచి ఉంచిన షట్టరుకు ఓ యువకుడు వచ్చి ‘‘నాకు ఐదు మంచి లోకల్ ఫిలింలు కావాలి…సాయంత్రం వస్తానంటూ పెన్ డ్రైవ్ ఇచ్చేసి వెళ్లాడు. కొందరు దుకాణాదారులు ఖాతాదారులు ఇచ్చిన పెన్ డ్రైవ్ లలో రేప్ వీడియోలను నింపి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఉపయోగపడిన ఈ రేప్ వీడియోలు ప్రస్థుతం వ్యాపార వస్తువులుగా మారాయి.

రేప్ వీడియోలు విక్రయిస్తున్న నాకా హిందోళ మార్కెట్ కు కేవలం ఐదు వందల మీటర్ల దూరంలోనే పోలీసుస్టేషను ఉన్నా వారు వ్యాపారుల నుంచి ముడుపులందుకొని ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని వ్యాపారులే చెపుతున్నారు. గతంలో పైరేటెడ్ ఫిలిం వీడియోలు విక్రయించే వ్యాపారులు యువత డిమాండును బట్టి ఇప్పుడు రేప్ వీడియోలను విక్రయిస్తున్నారు. పది నిమిషాల నుంచి 30 నిమిషాల నిడివి గల రేప్ వీడియోను 300 నుంచి 500 రూపాయల దాకా విక్రయిస్తున్నారు. తాము అత్యాచార వీడియోలను ఐదువేల రూపాయలకు కొని రేపిస్టు ముఖం కనిపించకుండా బ్లర్ చేసి దానికి బాధిత అమ్మాయి పెట్టే కేకలతో కూడిన ఆడియో ట్రాక్ జోడించి వంద నుంచి రెండు వందల రూపాయలకు కూడా వీటిని బహిరంగంగానే విక్రయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన యువకులు వచ్చి ఈ రేప్ వీడియోలను కొంటున్నారు. దీంతో రేప్ వీడియోల విక్రయం జోరుగా సాగుతోంది.

 

Source : Andhra  jyothi

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *