అంజన్న ఆలయంలో ఘనంగా పూజలు

 

నిజాంసాగర్‌, నవంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని బ్రాహ్మణ్‌పల్లి గ్రామ గేటు వద్దగల సంగారెడ్డి-అకోల-నాందేడ్‌ జాతీయ రహదారి 161 పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయస్వామి ఏకశిల పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేవతాపూజలు, ఆవాహిత దేవత హోమాలు, మూలమంత్ర హోమాలు, ధాన్యాధివాసం, ఫలాధివాసం, పుష్పాధివాసం, శయ్యాధివాసం, మంగళహారతి, మంత్రపుష్పం, తదితర ప్రత్యేక పూజలు ఘనంగా జరిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ఏకశిల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం బ్రాహ్మణ్‌పల్లి గ్రామంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ధర్మకర్త పట్లోల్ల సునీత కిషోర్‌కుమార్‌కు ఎప్పటికి రుణపడి ఉంటామని గ్రామస్తులు ఆయన పనితీరును ప్రశంసిస్తున్నారు. ఆలయాన్ని ప్రతి నిత్యం పూజా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *