Breaking News

సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు జైలు శిక్ష

సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు జైలు శిక్ష పడింది. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. ‘టెంపర్‌’ సినిమాకు స్టోరీకి చెల్లని చెక్కు ఇచ్చారని రచయిత వక్కంతం వంశీ ఫిర్యాదు చేశాడు. దీనిపై శుక్రవారం(నవంబర్-24) ఎర్రమంజిల్‌ కోర్టులో ఆ కేసు విచారణ జరిగింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. గణేష్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు, 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది.
నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన బండ్ల గణేష్‌ అనేక సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ‘ఆంజనేయులు’ సినిమాతో నిర్మాతగా మారారు. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ‘గబ్బర్‌సింగ్‌’, ‘బాద్‌షా’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘టెంపర్‌’ వంటి విజయవంతమైన మూవీలను నిర్మించాడు.

Check Also

మోసపోయిన సినీనటి

ఓ చిట్‌ఫండ్ కంపెనీ తనను మోసంచేసిందంటూ సినీనటి సంజన ‘రిజిస్ట్రార్ అఫ్ కో ఆపరేటివ్ సొసైటీ’ వారికి ఫిర్యాదు చేసింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *