Breaking News

ఒడ్డేపల్లిలో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన

 

నిజాంసాగర్‌, నవంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ఒడ్డేపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన చాకలి సంధ్యారాణి, పండరి దంపతులు విగ్రహ ప్రతిష్టాపన చేశారని ప్రధానోపాధ్యాయురాలు సమత తెలిపారు. పాఠశాలలో సరస్వతి విగ్రహం ఏర్పాటు చేయిస్తామని చెప్పడంతో శుక్రవారం వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ రేఖ, రాములు, ఎంఇవో బలిరాం నాయక్‌, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్‌రావు, వెంకటరమణ, భాస్కర్‌గౌడ్‌, సంతోష్‌కుమార్‌, అమర్‌సింగ్‌, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహ దాత సంధ్యారాణి, పండరి దంపతులకు శాలువా, పూలమాలలతో సత్కరించారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *