Breaking News

Daily Archives: December 1, 2017

కానిస్టేబుల్‌ కిష్టయ్య విగ్రహావిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందల్వాయి మండలం లింగాపూర్‌ స్టేజి వద్ద నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ శుక్రవారం తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న కానిస్టేబుల్‌ కిష్టయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కానిస్టేబుల్‌ కిష్టయ్య ఆత్మబలిదానం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అనంతరం కిస్టయ్య విగ్రహనికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బాజిరెడ్డి జగన్‌, తెరాస నాయకులు తదితరులు ...

Read More »

బడా పహాడ్‌లో అక్రమాలు ఉపేక్షించేది లేదు

  – వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలం బడా పహాడ్‌ దర్గాలో అక్రమాలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో తన చాంబరులో మైనార్టీ వెల్పేర్‌ సెక్రెటరీ, వక్ప్‌ బోర్డు సిఇవోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడా పహాడ్‌ దర్గాలో అక్రమాలపై కొన్నిరోజులుగా పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, తాము ఏర్పాటు చేసిన కమిటీ ...

Read More »

నాందేవ్‌వాడలో చోరీ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని నాందేవ్‌వాడకు చెందిన అనురాధ అనే మహిళ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగిందని 3వ టౌన్‌ ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు. ఆ సమయంలో బాధితులు శుభకార్యం నిమిత్తం హైదరాబాద్‌ వెళ్ళారని, ఇదే అదనుగా భావించి దొంగలు చోరీకి పాల్పడ్డారని ఆయన తెలిపారు. 1.5 గ్రాముల బంగారం, 4 గ్రాముల ఉంగరం అపహరణకు గురైనట్టు, దొంగలను త్వరలో పట్టుకుంటామని, అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ...

Read More »

ఎంపి కవితను కలిసిన అభంగపట్నం బాధితులు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం అభంగపట్నం దాడి ఘటనలో బాధిత కుటుంబసభ్యులు శుక్రవారం ఎంఆర్‌పిఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితను కలిశారు. ఘటన అనంతరం ఆచూకి లేకుండా పోయిన కొండా లక్ష్మణ్‌ భార్య భావన, తల్లి నర్సమ్మ, రమేశ్‌ భార్య లత ఎంపిని కలిశారు. సెప్టెంబర్‌ 2వ తేదీన భరత్‌రెడ్డి తమ వారిపై దాడిచేశాడని, ఈ విషయం వివిధ పత్రికల్లో, మీడియాలో రావడంతో భరత్‌రెడ్డితోపాటు బాధితులు ఇద్దరి ...

Read More »

రుణమాఫీ పొందని రైతులకు మాపీ అందజేయాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ జరిగినపుడు అర్హులైన కొందరు రైతులు రుణమాపీ పొందలేకపోయారని, వారిని గుర్తించి వారికి రుణమాఫీ డబ్బు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. జిల్లా లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ శివకుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య సంబంధిత బ్యాంకు మేనేజర్లతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో సుమారు 607 మంది అర్హులైన రైతులు రుణమాఫీ జాబితాలో పొందుపరచకపోవడం వల్ల రుణమాఫీ పొందలేకపోయారన్నారు. దాన్ని పరిశీలించి ...

Read More »

ఎయిడ్స్‌ను నివారించినపుడే లక్ష్యం నెరవేరుతుంది

  కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎయిడ్స్‌ వ్యాధిని తగ్గించడమే కాకుండా పూర్తిగా నివారించినపుడే లక్ష్యం నెరవేరుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ హెచ్‌ఐవి వ్యాప్తిని 5.25 శాతం నుంచి 0.99 శాతానికి తగ్గించడం జరిగిందన్నారు. తగ్గించడమే కాకుండా లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మనిషి తప్పిదాల వల్ల వ్యాధి వస్తుందని, ...

Read More »

ఘనంగా జిల్లాస్తాయి ప్రపంచ తెలుగు మహాసభలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోగల రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం ప్రపంచ తెలుగు మహాసభలు జిల్లా స్థాయిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త, ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ తన విద్యాభ్యాసం ఇంటర్మీడియట్‌ వరకు తెలుగు మాద్యమంలో కొనసాగిందని, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా తెలుగు మాట్లాడేవారు కలిస్తే గర్వంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నేటి యువత మన పండుగలైన ...

Read More »

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త శుక్రవారం 50వ డివిజన్‌ పరిధిలోగల కంఠేశ్వర్‌ బైపాస్‌ వద్ద విఠలేశ్వరాలయం ఎదురుగా కమ్యూనిటి హాల్‌ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం తారకరామనగర్‌లో బంజారా భవన్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము నిజామాబాద్‌ నగరంలో అన్ని వర్గాల ప్రజలకు సిడిపి నిధుల ద్వారా కమ్యూనిటి హాల్‌ నిర్మించి ఇస్తున్నామని, కేవలం భూమి పూజకు పరిమితం కాకుండా భవనాల నిర్మాణాలు పూర్తయ్యేవరకు ...

Read More »

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

  కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే వాటరింగ్‌ డే సందర్భంగా ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మొక్కలకు నీరుపోశారు. అనంతరం రాశి వనంలోని మొక్కలను, ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో, పట్టణాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో నాటిన మొక్కలను ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు విద్యార్థులు బాద్యత తీసుకొని వాటిని సంరక్షించాలని సూచించారు. ...

Read More »

ఇంటి పన్ను వసూలు ముమ్మరం చేయండి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సుంకిపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప ఇంటి పన్నుల వసూలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం రైతుల చేతికి దాన్యం డబ్బు అందకపోవడంతో పన్నులు చెల్లించడం లేదని, ఇంటి పన్ను వసూలు కోసం ఇంటింటికి తిరుగుతూ పన్నులు చెల్లించాలని కోరారు. పన్నులు సకాలంలో చెల్లిస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల సంఖ్య పెంచాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల శాతాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ వైద్యాదికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖల పనితీరును వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెసిఆర్‌ కిట్‌లపై అవగాహన కల్పించాలని, మాతా శిశువులకు అందిస్తున్న సేవలను వివరించాలని కోరారు. విధిగా సమావేశాలు నిర్వహించి సిబ్బంది సేవలను ముందుండి నడిపించాలన్నారు. అంగన్‌వాడి కేంద్రాలను ...

Read More »

భూ కబ్జాదారుల దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో భూ కబ్జాదారుల వైఖరిని నిరసిస్తూ శుక్రవారం విద్యార్థి సంఘాల జేఏసి ఆధ్వర్యంలో వారి దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తప్పుడు పాసుపుస్తకాలు సృష్టించి, అధికారులతో కుమ్ముక్కై భూకబ్జాదారులు కళాశాల స్థలాలను ఆక్రమించుకోవడం గర్హణీయమన్నారు. ఓ పక్క కళాశాల ఆస్తుల రక్షణకు పోరాడుతుంటే మరోపక్క ఆస్తులను కాజేస్తున్నారని దుయ్యబట్టారు. కబ్జాదారుల నుంచి భూములను స్వాధీనం చేసుకోకపోతే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని ...

Read More »

ఇజిఎస్‌ కూలీలకు పనులు కల్పించండి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లతో ఎపివో సుదర్శన్‌ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని 18 గ్రామ పంచాయతీల ఫీల్డ్‌ అసిస్టెంట్లు హాజరుకాగా ఏఏ పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, పంట కాలువల్లో పూడిక తీత పనులు తదితర పనులు చేయించాలని సూచించారు. అలాగే గ్రామాల్లో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా వేగవంతం చేయాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లకు సూచించారు. ప్రతి గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసేలా ...

Read More »

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ సర్వే

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి స్వచ్చమైన తాగునీరు అందించేందుకు పైప్‌లైన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగానే సుంకిపల్లి తాండా వద్ద నూతనంగా నిర్మిస్తున్న వాటర్‌ ట్యాంక్‌లోకి పైప్‌లైన్‌ పనులకోసం ప్రశాంత్‌, మహేశ్‌లు సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా టోటల్‌ కంట్రోల్‌ స్టేషన్‌ యంత్రం ద్వారా పైప్‌లైన్‌ సర్వే చేస్తున్నారు. సుంకిపల్లి తాండా వద్ద తెలంగాణలో అతిపెద్ద వాటర్‌ ట్యాంకు 15 లక్షల లీటర్ల సామర్థ్యంగల నిర్మాణ ...

Read More »

ఎయిడ్స్‌ ర్యాలీ

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు, నవోదయ విద్యార్థులు శుక్రవారం ఎయిడ్స్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఐకెపి కార్యాలయం నుంచి ప్రారంభమై బస్టాండ్‌, పోలీసు స్టేషన్‌ మీదుగా నినాదాలు చేస్తు పాఠశాల వరకు నిర్వహించారు. ఆదర్శ పాఠశాలలో ఎయిడ్స్‌ దినం సందర్భంగా విద్యార్థులకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. చార్ట్‌పై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. హెచ్‌ఐవి ఎఐడిఎస్‌ ఆకారంలో విద్యార్థులు కూర్చొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి, వైద్యాధికారి స్పందన, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ...

Read More »