Breaking News

Daily Archives: December 2, 2017

వెంకన్న ఆలయంలో అన్నదానం

  బీర్కూర్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో శనివారం బిచ్కుంద గ్రామానికి చెందిన గాండ్ల గంగాధర్‌ సుజాత దంపతులు అన్నదానం చేశారు. మొదట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానంచేశారు. శనివారం కావడంతో ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా వుంది. ఆలయ కమిటీ సభ్యులు గాండ్ల రఘు, బసవరాజు, కృష్ణారెడ్డి, ఆకుల మురళి పాల్గొన్నారు.

Read More »

ఘనంగా దత్త జయంతి

  గాంధారి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో దత్త జయంతిని శనివారం భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో దత్త జయంతి వేడుకలు జరుపుకున్నారు. గౌరారం గ్రామంలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దత్త జయంతి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తూము అంజయ్య, సర్పంచ్‌ వసంత, జయరాం, శంకర్‌, నారాయణ, మారుతి, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  గాంధారి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో సిసి రోడ్డు పనులను శనివారం జడ్పిటిసి తానాజీరావు ప్రారంభించారు. స్తానిక దుర్గానగర్‌ కాలనీలో ఎమ్మెల్సీ నిధుల నుంచి 8 లక్షల వ్యయంతో పనులు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గుత్తేదార్లకు సూచించారు. పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

వంతెన వెడల్పు కలేనా…?

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని బూర్గుల్‌, కోమలంచ గ్రామాలకు వెళ్లే వంతెన ఇరుకుగా ఉండడంతో ప్రజలు, వాహనదారులు, పశువులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రాజెక్టు ప్రధాన కాలువపై ఇరుకు వంతెన వల్ల రెండు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాహనదారులు వంతెనపై నుంచి పడి గాయాలపాలైన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. మూగజీవాలు సైతం వంతెనపై నుంచి కాలువలో పడి మృత్యువాతపడ్డాయి. వంతెనకు ఆనుకొని ఉన్న లేయింగ్‌ పిల్లర్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇరుకు వంతెనను ...

Read More »

జివో 31, 55 రద్దు చేయాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జివో 31, జివో 55 లను ప్రభుత్వం రద్దుచేయాలని విశ్వకర్మ కార్పెంటర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. శనివారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జివో 31, 55ల ప్రకారం సామిల్‌, వడ్రంగి వృత్తులపై ఆధారపడిన యజమానులు, కార్మికులు తమ జీవన భృతిని కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. దీనివల్ల గృహ నిర్మాణదారులకు సైతం తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి జీవోలను రద్దుచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మారుతి, రఘుపతి, ...

Read More »

కళాశాల హద్దులను తొలగించిన విద్యార్థి సంఘాలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హద్దులను శనివారం జేఏసి విద్యార్థి సంఘాలు తొలగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసి కన్వీనర్‌ జగన్నాథం మాట్లాడుతూ కళాశాల మైదానం భూమి కళాశాల ఆస్తుల్లో అంతర్భాగమన్నారు. కొందరు కబ్జాదారులు అధికారులకు లంచాలిచ్చి తప్పుడు ద్రువపత్రాలు సృష్టించి కోర్టునుతప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. మైదానం జోలికొస్తే ఆందోళన తప్పదని పేర్కొన్నారు. భూ కబ్జాదారులు, వారికి సహకరించిన అధికారులపై క్రిమినల్‌ ...

Read More »

ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహ్మద్‌ ప్రవక్త జయంతి, మిలాద్‌ ఉన్‌ నబీ పండగ పురస్కరించుకొని శనివారం తెలంగాణ మైనార్టీ ఎంప్లాయిస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపినీ చేశారు. దీనికి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఫ్యామిలి ప్లానింగ్‌ వార్డులో, ప్రసూతి వార్డులో పండ్లు అందజేశారు. మైనార్టీ సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్‌ప్రవక్త సూక్తులను, సందేశాలను పాటించాలని, అందరు సోదర భావంతో మెలిగి మంచి సమాజ ...

Read More »

ఇష్టంతో చదువుకొని లక్ష్యం చేరుకోవాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఇష్టంతో చదువుకొని లక్ష్యాన్ని చేరుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శనివారం బీబీపేట మండలం మల్కాపూర్‌ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆలోచనలు పెంచుకోవాలని, ఒత్తిడిని దరిచేరనీయొద్దని సూచించారు. ఆరోగ్యం, చదువు, కుటుంబ విలువలే విద్యార్థులకు ఆస్తులని సూచించారు. పాజిటివ్‌ దృక్పథాన్ని పెంచుకోవాలని చెప్పారు. గ్లిజర్‌ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. నెల చివరిలోగా అదనంగా ...

Read More »

స్వాగత బోర్డులు ఏర్పాటు చేయరా….?

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎంతోప్రాధాన్యత సంతరించుకుంది. కానీ అధికారుల నిర్వహణ, సిబ్బంది కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అధ్వాన్నంగా మారింది. నిజాంసాగర్‌ ప్రధాన రహదారిలో విఐపి అధికార యంత్రాంగానికి స్వాగతం తెలిపే బోర్డులను ఏర్పాటు చేయలేకపోతున్నారు. ఎల్లారెడ్డి, నాందేడ్‌ రహదారి నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వెళ్లే దారిలో స్వాగతబోర్డులు ఏర్పాటు చేసి ముళ్లపొదల్లో పారవేశారు. సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ...

Read More »

ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ ర్యాలీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా శనివారం కామారెడ్డి పట్టణంలో ఘనంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఇస్లాంపూర్‌, పాత బస్టాండ్‌ నుండి వందలాది మంది ముస్లింలు రెండు విడతల్లో ర్యాలీ చేపట్టారు. మహ్మద్‌ప్రవక్తకు అనుకూలంగా నినాదాలు చేస్తు ఊరేగింపు చేశారు. పాత బస్టాండ్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ స్టేసన్‌ రోడ్‌, భవానీరోడ్డు మీద నిరంజన్‌షా దర్గాకు చేరుకుంది. ఇస్లాంపూర్‌ నుంచి బయల్దేరిన మరోర్యాలీ రైల్వే వంతెన, కొత్త బస్టాండ్‌, సైలాన్‌బాబా కాలనీ, ...

Read More »

ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన

  కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనులను శనివారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ. 31 లక్షల వ్యయంతో 30 అదనపు పడకల గదులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. వాటిని ఈనెల 25 లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. 7 లక్షలతో నిర్మిస్తున్న వెయిటింగ్‌ రూం షెడ్‌ నిర్మాణాన్ని ఈనెల 15 లోగా పూర్తిచేయాలని, 17 లక్షలతో నిర్మిస్తున్న నీటి సరఫరా పైప్‌లైన్‌, డ్రైనేజీ పనులను ...

Read More »

అఖిల భారతీయ వంజరి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కరిపె రాజు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారతీయ వంజరి సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నిజామాబాద్‌ నగరానికి చెందిన కరిపె రాజును నియమించినట్టు జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు పురుషోత్తం వసంత్‌కాలే, ప్రఫుల్ల కుమార్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. మహారాష్ట్రలో శనివారం సదుర్బా జిల్లాలో జరిగిన సమావేశంలో కరిపె రాజు ఎన్నికను సంఘ సభ్యులు ప్రకటించడంతోపాటు నియామక పత్రం అందజేశారు. వంజరి సమాజానికి రాజు చేస్తున్న సేవలను గుర్తించి ఆయనను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినట్టు వారు ...

Read More »

త్వరలో రామమందిర నిర్మాణం

  – స్వామి పరిపూర్ణానంద కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తరప్రదేశ్‌లో త్వరలో రామ మందిర నిర్మాణం ప్రారంభమవుతుందని శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద అన్నారు. విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లారామేశ్వర్‌పల్లి గ్రామంలో నిర్మించిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని శనివారం స్వామిజీ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో స్వామీజీ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ అద్భుత పాలన కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. అలాగే దేశంలోని 29 రాస్ట్రాల్లో సన్యాసులు పరిపాలిస్తే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని, సర్వతోముఖాభివృద్ది చెందుతుందని అభిలాషించారు. ...

Read More »

తన కుమారుని చంపిన వారిని జైళ్లో పెట్టాలి

  – ఓతల్లి ఆవేదన నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌కు చెందిన శ్రీనివాస్‌ అలియాస్‌ వెంకటేశ్‌ 2010 మే 2వ తేదీన హత్యకు గురయ్యాడని అతని తల్లి అనసూయ తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన కుమారున్ని గొర్రె ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గాడిచర్ల శ్రీశైలం, తీగల కిరణ్‌, పెరిక నవీన్‌కుమార్‌లు కలిసి హత్యచేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుల్ని నామమాత్రంగా పోలీసు స్టేషన్‌కు ...

Read More »

అభంగపట్నం ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

  – ఎంబిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండి వెంకట్‌ నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో దళితుల పై జరిగిన దాడి, అనంతరం కిడ్నాప్‌, 20 రోజుల తర్వాత బాధితులు రాజేశ్వర్‌, లక్ష్మణ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రత్యక్షం కావడం, తమపై ఎలాంటి దాడి జరగలేదని తెలపడం, అభంగపట్నం చేరుకున్న తర్వాత భరత్‌రెడ్డికి భయపడి అలా చెప్పామని అనడంపై పలు అనుమానాలకు తావిస్తుందని ఎంబిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండి వెంకట్‌ అన్నారు. శనివారం ...

Read More »

ప్రశాంతంగా మిలాద్‌-ఉన్‌-నబీ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కమీషనరేట్‌ పరిధిలో ముస్లింల పండుగ అయిన మిలాద్‌-ఉన్‌-నబీ ప్రశాంతంగా జరిగినట్టు పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. కమీషనరేట్‌ పరిధిలో నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ డివిజన్లలో ముస్లింలు ర్యాలీలు నిర్వహించారని, ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసినట్టు ఆయన తెలిపారు. ర్యాలీ ప్రశాంతంగా ముగిసిందని ఆయన చెప్పారు.

Read More »

ఆదివారం మహా పేరిణి శివతాండవం

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం స్తానిక కలెక్టరేట్‌ మైదానంలో 371 మంది కళాకారులతో మహా పేరిణి శివతాండ నాట్యోత్సవం నిర్వహిస్తున్నట్టు ఇందూరు పేరిణి నాట్యకళాకారుల సంస్త ప్రధాన కార్యదర్శి సంతోష్‌ తెలిపారు. శనివారం స్తానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం నిర్వహించే నాట్య ప్రదర్శన పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందని, సుద్దపల్లి గురుకుల పాఠశాల నుంచి 300 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చి ...

Read More »

శబరిమలలో తాత్కాలికంగా దర్శనం నిలిపివేత

కేరళ: ఓక్కీ తుఫాను ప్రభావంతో దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి కన్యాకుమారిలో వందల చెట్లు నేలకూలాయి. ఇప్పటి వరకు నలుగురు మృతిచెందారు. భారీ వర్షం వల్ల పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలకు వెళ్లే రహదారులు మూసివేశారు. దీంతో శబరిమల ఆలయంలో గురువారం సాయంత్రం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 7గంటల వరకు దర్శనం నిలిపివేశారు. శబరిమల అధికారులు యాత్రికులకు హెచ్చరికలు జారీ చేశారు. సన్నిధానం, పంబ వద్ద ఉన్న భక్తులు అక్కడి అధికారులను సంప్రదించి సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని ...

Read More »