Breaking News

Daily Archives: December 3, 2017

హౌజింగ్‌బోర్డులో చోరీ

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని న్యూ హౌజింగ్‌బోర్డు కాలనీలో వీరారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగినట్టు రూరల్‌ సిఐ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వీరారెడ్డి శుభకార్యం నిమిత్తం సంగారెడ్డికి ఇంటికి తాళంవేసి వెళ్లారని, ఇదే అదనుగా భావించి దొంగలు ఇంట్లోంచి 5 తులాల బంగారం అపహరించినట్టు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సిఐ తెలిపారు.

Read More »

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆకుల రోహిత్‌

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2013 అంతర్జాతీయ పారా ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ఆకుల రోహిత్‌ ఆదివారం రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఉత్తమ క్రీడాకారునిగా అవార్డు అందుకున్నాడు. తెలుగు రాష్ట్రాల నుంచి అవార్డు అందుకున్న ఏకైక క్రీడాకారుడు ఆకుల రోహిత్‌. రోహిత్‌ ఫ్లోర్‌బాల్‌, బేస్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచాడు. రోహిత్‌ నిజామాబాద్‌ ఏసిపి (అడ్మిన్‌) ఆకుల రాంరెడ్డి ఏకైక కుమారుడు.

Read More »

ఘనంగా దత్త జయంతి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్గశిర మాసం పౌర్ణమి దత్త జయంతిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వినాయక్‌నగర్‌లోగల దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. స్వామివారికి పుష్పాలంకరణ, అర్చనలు, అభిషేకాలు, డోలారోహణం, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ ఉత్సవానికి బాసర వేదపాఠశాల విద్యార్థులు పాల్గొని వేద పఠనం చేశారు. ఆలయ వ్యవస్తాపక అధ్యక్షుడు హరిదాస్‌ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు ...

Read More »

విద్యాలయ అభివృద్దికి కృషి చేస్తా

  – కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నిజాంసాగర్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఆదివారం నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని జవహార్‌ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలెక్టర్‌, హైదరాబాద్‌ జేఎన్‌వి డిప్యూటి కమీషనర్‌ ఏవై రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం ...

Read More »