Breaking News

Daily Archives: December 4, 2017

వైద్య, విజ్ఞాన ప్రదర్శనను సందర్శించిన మంత్రి

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలలో జరుగుతున్న జిల్లా స్తాయి వైద్య, వైజ్ఞానిక ప్రదర్శన – 2017ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయినుంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, మనదేశం నుంచి టెక్నాలజి రంగంలో విద్యార్థులు అంతర్జాతీయ ఖ్యాతి పొందుతున్నారని, నేడు పోటీ తత్వం పెరిగిందని, విద్యార్థులకు సాంకేతిక రంగంలో ప్రోత్సహించడం అందరి బాధ్యత అని మంత్రి పోచారం …

Read More »

హైదరాబాద్‌ దర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీలు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి సోమవారం ఐసిడిఎస్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి నిజామాబాద్‌ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అంగన్‌వాడి కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడిల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జిల్లా నాయకురాలు దేవగంగు ఆరోపించారు. కార్యక్రమంలో స్వర్ణ, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.

Read More »

బిజెవైఎం నాయకుల అరెస్టు

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర జేఏసి నాయకుల పిలుపు మేరకు కొలువుల కొట్లాటకు బయల్దేరిన బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు న్యాలం రాజు, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేసి 4వ టౌన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతుందని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని వారు ఆరోపించారు.

Read More »

రోడ్ల నిర్మాణాల వల్ల పరిశ్రమల ఏర్పాటుకు దోహదం

  కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లు నాగరికతకు చిహ్నాలని, రోడ్లు, వంతెనల నిర్మాణం వల్ల రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకుదోహదమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన బీర్కూర్‌ మండలంలో మంజీర నదిపై రూ. 45 కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్‌ వంతెన పనులను పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెనకబడిన ప్రాంతానికి వంతెన నిర్మాణంతో కనెక్టివిటి పెరుగుతుందన్నారు. దీని వల్ల తెలంగాణ, మహారాష్ట్ర వాసులకు రవాణా …

Read More »

భూ రికార్డుల ప్రక్షాళన వేగవంతం చేయాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ భూ రికార్డుల ప్రక్షాళన వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. సోమవారం ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపిడివోలతో అభివృద్ది పథకాలపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఓడిఎఫ్‌ పనుల్లో వేగం పెంచాలని, ఈనెల 20 లోగా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. 39 శాతం నుంచి 73 శాతానికి ఓడిఎఫ్‌ పెంచామని, మిగతా వాటిని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. హరితహారంలో …

Read More »

సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం కంఠేశ్వర్‌లో సేంద్రీయ ఉత్పత్తుల కేంద్రాన్ని మంత్రి ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రసాయన ఎరువులు వాడిన పదార్థాలు తిని ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, దీంతో ఆసుపత్రులు బహిరంగ సభలుగా మారుతున్నాయని, సంపూర్ణ ఆరోగ్యానికి స్వచ్చమైన గాలి, సురక్షిత నీరు అవసరమని, ప్రజలు సేంద్రీయ ఉత్పత్తులు …

Read More »

గ్రామ పంచాయతీ ఉద్యోగుల ర్యాలీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సోమవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని 8694 గ్రామ పంచాయతీల్లో తాత్కాలిక వేతనాలపై అనేక మంది పనిచేస్తున్నారన్నారు. వీరిలో 90 శాతందళిత వర్గాల వారే ఉన్నారని పేర్కొన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ రూ. 18 వేల కనీస వేతనం …

Read More »

ఓడిఎఫ్‌ను నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓడిఎఫ్‌ పనులను ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన మండలాల్లో నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం జనహిత భవనంలో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. అన్ని గ్రామాల్లో తప్పనిసరిగా మరుగుదొడ్ల నిర్మాణం చేయించాలని, గ్రామ పంచాయతీ సిబ్బంది విధిగా ఈ పనిలో నిమగ్నమవ్వాలని సూచించారు. ప్రత్యేకాధికారులు రెండ్రోజుల పాటు గ్రామాల్లో ఉండి పనులు చూడాలని ఆదేశించారు. దత్తత గ్రామాలైన ఎల్లమ్మ …

Read More »

ఫోన్‌ ఇన్‌ కలెక్టర్‌లో 11 ఫిర్యాదులు

  కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి 11 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్‌ సత్యనారాయణ స్వయంగా ఫోన్‌ ద్వారా ఫిర్యాదుదారులతో మాట్లాడారు. భూ కబ్జాలు, ట్రై సైకిళ్ళు, కూల్చివేతల తొలగింపు, గేదెల కొనుగోలు, దృవీకరణ పత్రాల అందజేత, పహణీలకు సంబంధించిన 11 ఫిర్యాదులు కలెక్టర్‌ స్వీకరించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సిపివో శ్రీనివాస్‌, ఐసిడిఎస్‌ అధికారి …

Read More »

ప్రజావాణిలో 51 ఫిర్యాదులు

  కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 51 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. రెవెన్యూశాఖకు సంబంధించి 18, డిఆర్‌డిఓ పింఛన్లకు సంబంధించి 4, మునిసిపల్‌ 4, హౌజింగ్‌ 4, పోలీసు 2తో పాటు వివిధ శాఖలకు సంబంధించి ఫిర్యాదులు అందాయన్నారు. వాటిని వెంటనే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, డిఆర్వో మణిమాల, ఆయా శాఖల అధికారులు …

Read More »