Breaking News

Daily Archives: December 5, 2017

స్వచ్చంద ఆరోగ్య నేస్తం సభ్యుల సేవలు అభినందనీయం

  కామారెడ్డి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చంద ఆరోగ్య నేస్తం సభ్యులు రోగులకు సలహాలు, సూచనలు ఇస్తు సేవలందిస్తున్నారని వారి సేవలు అభినందనీయమని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బీబీపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్చంద ఆరోగ్య నేస్తం సభ్యులు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా వారు చేస్తున్న సేవలను కొనియాడారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఇతరులతో కలిసి ఉన్న 12 మంది స్వచ్చంద …

Read More »

పేదవాడి సొంతింటి కల నిజం చేస్తున్నాం

  కామారెడ్డి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదవాడి సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేస్తుందని, పేదవారు ఆత్మగౌరవంతో బతికేలా చేయూత నిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడలోని వీక్లిమార్కెట్‌తోపాటు మండలంలోని బోర్లం క్యాంపు, కృష్ణానగర్‌ తాండాల్లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లను మంగళవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధనవంతులైనా, పేదవారైనా ఆత్మగౌరవం ఒకటే అన్నారు. గతంలో 70 వేలు, లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ప్రస్తుతం …

Read More »

జివో 31, 55ల రద్దు కోసం భారీ ర్యాలీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ శాఖ ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన జివో 31, 55లను వెంటనే ఉపసంహరించుకోవాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం అఖిలభారతీయ విశ్వకర్మ పరిసత్‌, సామిల్‌, కార్పెంటర్స్‌ యజమాన కార్మికుల సంయుక్త సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము రైతుల వ్యవసాయ పట్టా భూముల నుండి వారి అభ్యర్థన మేరకు సామిల్‌కు తీసుకొచ్చిన …

Read More »

సేంద్రీయ ఎరువులతో అధిక దిగుబడులు పొందాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంపొందించుకొని అధిక దిగుబడులు సాధించాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సూచించారు. కామారెడ్డి జనహిత భవనంలో ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు, రైతులు వ్యవసాయ విస్తీర్ణాధికారులతో భూసార పరీక్షల ఆవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకొని భూమి హెల్త్‌ కార్డును అనుసరించి రసాయనిక ఎరువులు …

Read More »

కామారెడ్డి, బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌ స్థాయిలో ఆధునీకరిస్తాం

  కామారెడ్డి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులను కార్పొరేట్‌ ఆసుపత్రుల స్థాయిలో ఆధునీకరిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ చాంబరులో మంగళవారం కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్‌, రవిందర్‌రెడ్డి, హన్మంత్‌ షిండేతో పాటు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతో కలిసి జిల్లా అదికారులతో ఆసుపత్రుల ఆధునీకరణ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ పనులు, వ్యవసాయంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కామారెడ్డి ప్రభుత్వ …

Read More »

108లో ప్రసవం

  గాంధారి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం మాధవపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ 108లో ప్రసవించింది. 108 సిబ్బంది తెలిపిన ప్రకారం… మాధవపల్లికి చెందిన శివలక్ష్మికి రెండవ కాన్పు కాగా మంగళవారం 1.30 గంటలకు ఆమెకు నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. వెంటనే 108 అక్కడికి చేరుకొని మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవించింది. మొదటి కాన్పు ఆపరేషన్‌ కాగా రెండవ కాన్పు నార్మల్‌ డెలివరి అని ఇఎంటి మధుకర్‌, పైలట్‌ హరీష్‌ తెలిపారు. …

Read More »

ఆరోగ్య ఆసుపత్రిలో అరుదైన చికిత్స

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆరోగ్య ఆసుపత్రిలో అరుదైన చికిత్స నిర్వహించినట్టు ఆసుపత్రి వైద్యులు వెంకటకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్‌ జిల్లా మల్లగొండ గ్రామానికి చెందిన శాంతారాం అనే వ్యక్తికి కిడ్నీలో 15 ఎం.ఎం., 10 ఎం.ఎం, 7 ఎం.ఎం, రాళ్ళు తయారుకావడంతో తీవ్ర నొప్పితో బాధపడుతుండగా ఆరోగ్య ఆసుపత్రికి వచ్చాడన్నారు. తాము వైద్య పరీక్షలు నిర్వహించగా అతనికి కిడ్నీలో అనేక రాళ్ళు ఉన్నట్టు గుర్తించి ఒకే సిట్టింగ్‌లో బైలేటర్‌, …

Read More »

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

  గాంధారి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. రెండ్రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్య, విద్యార్థులపై పోలీసు లాఠీచార్జికి నిరసనగా విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గాంధారి మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలను విద్యార్థి సంఘాలు బంద్‌ చేయించారు. విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక నెహ్రూ చౌరస్తా వద్ద విద్యార్థులు …

Read More »

రసాయనిక ఎరువులు తగ్గించాలి

  – జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రసాయనిక ఎరువుల వల్ల పెనుప్రమాదం పొంచి ఉందని, రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రీయ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ భూసార దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని, దీనివల్ల అనువైన పంటలు వేసేందుకు రైతులకు అవగాహన కలుగుతుందని అన్నారు. …

Read More »

పారిశుద్యంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

  – నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారిశుద్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఓడిఎఫ్‌పై సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరై ఎంపి మాట్లాడారు. బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా నిజామాబాద్‌ ఏర్పడిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిజామాబాద్‌ జిల్లాకు 4వ స్థానం లభించడం అందరికి గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో బహిరంగ …

Read More »