పేదవాడి సొంతింటి కల నిజం చేస్తున్నాం

 

కామారెడ్డి, డిసెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదవాడి సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేస్తుందని, పేదవారు ఆత్మగౌరవంతో బతికేలా చేయూత నిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడలోని వీక్లిమార్కెట్‌తోపాటు మండలంలోని బోర్లం క్యాంపు, కృష్ణానగర్‌ తాండాల్లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లను మంగళవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధనవంతులైనా, పేదవారైనా ఆత్మగౌరవం ఒకటే అన్నారు. గతంలో 70 వేలు, లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వంలో 100 శాతం సబ్సిడీపై ఒక్కో ఇంటికి రూ. 5.4 లక్షలు వెచ్చించి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లను పేదలకు అందిస్తున్నామన్నారు. తాగునీరు, సిసి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు లాంటి సౌకర్యాలకు మరో 1.25 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 2.70 లక్షల డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *