జివో 31, 55ల రద్దు కోసం భారీ ర్యాలీ

 

కామారెడ్డి, డిసెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ శాఖ ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన జివో 31, 55లను వెంటనే ఉపసంహరించుకోవాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం అఖిలభారతీయ విశ్వకర్మ పరిసత్‌, సామిల్‌, కార్పెంటర్స్‌ యజమాన కార్మికుల సంయుక్త సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్యకు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము రైతుల వ్యవసాయ పట్టా భూముల నుండి వారి అభ్యర్థన మేరకు సామిల్‌కు తీసుకొచ్చిన వేప, తుమ్మ, మామిడి తదితర జాతుల కలపను గృహోపకరణాల కోసం తయారుచేసి ఇస్తున్నామన్నారు. జివో 31,55 కారణంగా వేప, తుమ్మ, తదితర జాతులను తొలగించారని ఈ ఆంక్షల వల్ల కలప పరిశ్రమలు ఆధారిత కార్మికులకు గొడ్డలి పెట్టన్నారు. దీన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో విశ్వకర్మ జాతీయ అధ్యక్షుడు పున్నామచారి, రాష్ట్ర అధ్యక్షుడు రాజేశం, ప్రతినిదులు సుదర్శన్‌, వెంకటి, మారుతి, రఘుపతి, రాములు, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *