స్వచ్చంద ఆరోగ్య నేస్తం సభ్యుల సేవలు అభినందనీయం

 

కామారెడ్డి, డిసెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చంద ఆరోగ్య నేస్తం సభ్యులు రోగులకు సలహాలు, సూచనలు ఇస్తు సేవలందిస్తున్నారని వారి సేవలు అభినందనీయమని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బీబీపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్చంద ఆరోగ్య నేస్తం సభ్యులు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా వారు చేస్తున్న సేవలను కొనియాడారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఇతరులతో కలిసి ఉన్న 12 మంది స్వచ్చంద ఆరోగ్య నేస్తం సభ్యులు వైద్య సిబ్బందికి, రోగులకు మధ్య వారధిగా పనిచేస్తు రోగుల్లో ఉన్న భయాలను, సందేహాలను నివృత్తి చేసి వారికి మానసిక ధైర్యాన్ని కల్పిస్తున్నారని, ఇది మంచి పరిణామమన్నారు. వైద్యులు సైతం రోగులను చిరునవ్వుతో పలకరించి వారిలో ధైర్యం నింపాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లింగం, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి మధుశ్రీ, ఎన్‌డిసిసిబి ఉపాధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, మెడికల్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *